AADIVAVRAM - Others

మార్పు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆరోగ్యం బాగులేని వ్యక్తులను మార్పు కోసం స్థల మార్పు చేయమని సలహా ఇస్తారు. ఒత్తిడిలో వున్న వ్యక్తులు అలా బయటకు మార్పు కోసం వెళ్తుంటారు. స్థల మార్పు జరిగితే వాళ్ల ఆరోగ్యంలో, అదే విధంగా మానసిక ప్రవర్తనలో మార్పు వస్తుందని డాక్టర్లు చెబుతుంటారు.
నిజానికి జీవితంలో క్షణక్షణం ఎన్నో మార్పులు సంభవిస్తూ ఉంటాయి. మార్పులు లేకుండా జీవితం లేదు. జీవితంలో అతి ముఖ్యమైనది మార్పు. సృష్టిలోని ప్రతిదీ మార్పు చెందుతుంది. కాలం మార్పు చెందుతుంది. వాతావరణం మార్పు చెందుతుంది. వయస్సూ, శరీరం అన్నీ మార్పు చెందుతాయి. మనుషులు, ఫేషన్లూ ఇట్లా అన్నీ మారతాయి. మార్పు లేకుండా జీవితం లేదు.
జీవితంలో జరిగే మార్పులు మంచివి కావొచ్చు. ఆనందాన్ని ఇచ్చేవి కావొచ్చు. కొన్ని మంచివి కాకపోవచ్చు. భయపెట్టేవి కావొచ్చు. మన దృక్కోణాలని కూడా కొన్నిసార్లు మార్చుకోవాల్సి ఉంటుంది. మన దృక్కోణాలని, వైఖరులని మార్చుకోవడం వల్ల మన ప్రపంచం అందంగా మారవచ్చు. మన జీవితం బాగుపడటానికి మనం మార్పులు చేసుకోవచ్చు. కొన్నిసార్లు మనం కోరుకోకపోయినా మార్పులు సంభవించవచ్చు. ఆ మార్పులని మనం ఆమోదించడం తప్ప మరేం చేయలేం. వాటిని ఆమోదించడం తప్ప మనకి మరో మార్గం లేదు.
ఈ రోజు వున్న పరిస్థితి రేపు ఉండకపోవచ్చు. రేపు వున్న పరిస్థితి మర్నాడు ఉండకపోవచ్చు. అందుకని విచారించకుండా ప్రతి క్షణాన్ని ఆనందిస్తూ గడపాలి. ఈ రోజు రేపు గతం అవుతుంది. గతం ఎప్పుడూ మధురంగా చాలా మంది భావిస్తూ ఉంటారు. జ్ఞాపకాలు చాలాసార్లు నవ్వుని చిందిస్తాయి.
స్నేహితులతో కాలం గడపాలి. కుటుంబంలోని వ్యక్తులతో కాలం గడపాలి. అప్పుడప్పుడూ వర్షంలో తడవాలి. జీవితాన్ని కాస్త భిన్నంగా గడపాలి. జీవితం మనల్ని ఎక్కడికి తీసుకొని వెళ్తుందో చెప్పలేం. ఇతరులని జీవితం ఎక్కడికి తీసుకొని వెళ్తుందో కూడా చెప్పలేం.
కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. అది మారుతూనే ఉంటుంది. కాలం మారడం సృష్టి నియమం. కాలం ఎంత విలువైందో జీవితం అంతే విలువైంది. రెండూ మారుతూనే ఉంటాయి. కాలాన్ని ఎలా వాడుకుంటామన్నది మన చేతిలో ఉంది. జీవితం ఎలా మలచుకుంటామన్నది కూడా మన చేతిలో ఉన్నది. మన చేతిలో లేని దాన్ని మనం ఏమీ చేయలేం. మన చేతిలో వున్న వాటిని మనకు అనుకూలంగా మార్చుకోవడమన్నది మన చేతిలోని పని.