Others

నాకు నచ్చిన పాట--నరవరా.. ఓ కురువరా..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పొద్దునే్న రేడియోలో అప్పుడప్పుడు ఎస్.జానకి తియ్యనైన గాత్రంతో ఆలపించే ‘నరవరా.. ఓ కురువరా..’ అన్న పాట ఎన్నిసార్లు విన్నానో తెలియదు. మనసులో ఎన్నిసార్లు పాడుకున్నానో నాకే తెలుసు. నా మనసుకు నచ్చిన ఈ పాట ఎప్పుడైనా వినిపిస్తే అలా స్థాణువై నిలబడి వింటాను. ఇంధ్ర సభలో ఊర్వశి అర్జునుడి రాకను ఆనందంగా ఆస్వాదిస్తూ ఆయనపై ఓ కన్నువేసి, పొగడ్తల రూపంలో ప్రసన్నం చేసుకోడానికి ఈ పాట పాడుతుంది. తన కుమారుడు తనను చూడవచ్చాడని ఇంద్రుడు ఆప్యాయతతో అర్ధ సింహాసనం ఇచ్చి గౌరవిస్తాడు. అర్జునుడి అంద చందాలను, తెలివి తేటలను ఊర్వశి పొగుడుతూ నరవరుడైన ఆ కురువరుడిని, అతని భార్యలైన సుభద్ర, ఉలూచి, ద్రౌపది, ప్రమీలల ముచ్చటలను తన పాటలో ఆలపిస్తుంది. ఎస్.జానకి, సుసర్ల దక్షిణామూర్తి సంగీత దర్శకత్వంలో అద్భుతంగా ఈ పాటను ఆలపించారు. అందుకు ఊర్వశిగా నటించిన పద్మిని కూడా సంగీత, నృత్య విభావరిగా ఈ పాటను తీర్చిదిద్దింది. మధ్యమధ్యలో వచ్చే వీణానాదం వీనుల విందుగా ఆహ్లాద పరుస్తుంది. ఎన్ని మంచి పదాలు ఉన్నాయో ఈ పాటలో చెప్పలేం. నా మనసులోని మాట చెప్పడానికి సాటిలేని వీరుడువన్న యశమును అన్న మాటను జానకి నోటి నుండి పలికిన గమకాలు, శివుని నమక చమకాలుగా వినిపిస్తాయి. ఈ పాట నా చెవులకు దొరికిన వరంలా భావిస్తాను.
-కొమ్మన భూలక్ష్మి, నెల్లూరు