Others

ఎమోషనల్‌గా కనెక్టవుతా.. (డైరెక్టర్స్ చాయిస్..)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

-దర్శకుడు మను

మనం, దృశ్యం (మలయాళం, తెలుగు), పాపనాశనం చిత్రాలకు అసోసియేట్‌గా పనిచేసి, తొలిసారిగా సుమంత్ అశ్విన్ హీరోగా ‘రైట్ రైట్’ చిత్రానికి దర్శకత్వం వహించిన మను, పరిశ్రమలో ప్రామిసింగ్ దర్శకుడిగా తొలి చిత్రంతోనే పేరు తెచ్చుకున్నాడు. తమిళ, మలయాళ, తెలుగు సినిమాలపై చక్కని అవగాహన వున్న మనుతో ఈవారం చిట్ చాట్..
మీ నేపథ్యం?
-విజయనగరం జిల్లా సాలూరు. అయితే మా స్వస్థలం కేరళ. ఒకటినుంచి ఆరు వరకు తెలుగు మీడియంలో, అక్కడినుంచి పిజి వరకు కేరళలో చదువుకున్నా. దీంతో రెండు భాషలపై పట్టుతోపాటు తమిళాన్ని చక్కగా మాట్లాడగలను. విశాఖ జిల్లాలో నాంది ఫౌండేషన్‌లో ఎనిమిదేళ్లు ఉద్యోగం తరువాత దర్శకుడిగా మారాను.
దర్శకుడిగా ఎలా?
-సాలూరులో ఇంటి ఎదురుగా మూడు థియేటర్లు ఉండేవి. వాటిలో ప్రదర్శించే చిత్రాలన్నీ చిన్నప్పటినుంచీ చూసేవాడిని. 8వ తరగతినుంచే దర్శకుణ్ణి కావాలనే కోరిక వుండేది.
ఇష్టమైన జోనర్?
-ఎమోషన్‌కు ఫ్యాన్‌ని. తొలి చిత్రం రైట్ రైట్‌లోనూ ఇద్దరు స్నేహితుల మధ్య భావోద్వేగాల సమాహారం చూపించాను.
ఇప్పుడంతా లవ్, హారర్ జోనర్‌లేగా?
-ప్రేక్షకులు చూస్తున్నారు కనుక తీస్తున్నారు. దానికితోడు పరిశ్రమలో రెండు హిట్లు ఏ జోనర్‌లో వచ్చినా దాన్ని ఫాలో అవ్వడం సహజం. అలా లవ్, హారర్ జోనర్‌లే వస్తున్నాయని నేననుకుంటా.
పరిశ్రమలో సమస్యలు?
-నిర్మాతలు మంచి అభిరుచిగలవారు దొరకడంతో నేను సమస్యలూ ఎదుర్కోలేదు.
తొలి అవకాశం?
-మలయాళ దృశ్యం తరువత ఎంఎస్ రాజును కలిశా. ఆయన సైజ్ జీరో సినిమా టైంలో నన్ను పిలిచారు. తన ఫ్రెండ్ చిత్రానికి దర్శకత్వం వహించమన్నాడు. అదే రైట్ రైట్.
తదుపరి చిత్రాలు?
-రొమాంటిక్ కామెడీ జోనర్‌లో కథ రాసుకున్నా. రైట్ రైట్ నిర్మాతలే రూపొందించనున్నారు. త్వరలో ప్రారంభం అవుతుంది.
దర్శకుడంటే....?
-కెప్టెన్. అన్నివిధాలుగా తెలుసుకొని వుండాలి. ఎవరు ఏది చెప్పినా తాను అనుకున్నది తీయగలగాలి. ఎదుటివారు చెప్పిన విషయాల్లో మంచి వుంటే ఒప్పుకోగలగాలి.

-శేఖర్