Others

చరిత్ర సృష్టించిన ఆవేశం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అంజలీదేవి నిర్మించిన మహాకవి క్షేత్రయ్య ప్రారంభ దశ నుంచి సంచలనాలు సృష్టించింది. అందులో కొన్ని తెలుగు సినిమా చరిత్రలో మైలురాళ్ళుగా నిలిచాయి. నిర్మాతలు నిశ్చయించిన తేదీ ప్రకారం ఈ చిత్రం షూటింగ్ హైదరాబాద్ సారథి స్టూడియోలో ప్రారంభోత్సవం జరుపుకోవాల్సి ఉంది. కాని షూటింగ్ ప్రారంభోత్సవానికి ముందు అక్కినేని నటిస్తున్న చిత్రానికి స్టూడియో ఇవ్వటానికి స్టూడియో పాలకవర్గం నిరాకరించారు. అకస్మాత్తుగా ఈ నిర్ణయానికి అంజలీ పిక్చర్స్ తమ నిర్ణయాన్ని మార్చుకొని మైసూరు చాముండేశ్వరి స్టూడియోలో ఆ చిత్రం షూటింగ్ కొనసాగించి పూర్తిచేస్తారు. ఈ చిత్రం ప్రారంభం కాక ముందుసమయానికి అక్కినేని సారథి స్టూడియోలో అరవై చిత్రాలవరకు నటించి స్టూడియో బిజీ కావటానికి ముఖ్య కారకుడిగా నిలిచారు. హైదరాబాద్‌లో తెలుగు సినిమా అభివృద్ధి చెందాలన్న ఉద్దేశ్యంతో సౌకర్యాలుకరవైనా నటించి సారథి స్టూడియో అభివృద్ధికి తోడ్పడిన నా చిత్రానికే స్టూడియో ఇవ్వటానికి నిరాకరిస్తారా? మీ స్టూడియోకంటే సకల సౌకర్యాలుగల స్టూడియో నిర్మిస్తానని అన్నపూర్ణ స్టూడియో నిర్మాణం కావించనున్నట్లు అక్కినేని ఆవేశంగా ప్రకటించారు. ఆ ఆవేశంలో నిర్మాణం అయినదే అన్నపూర్ణా స్టూడియో. మరొక విషాదం క్షేత్రయ్య షూటింగ్ ప్రారంభమైన కొద్దికాలానికే దర్శకుడు ఆదుర్తి సుబ్బారావు ఆకస్మిక మృతితో ఆ చిత్రాన్ని దర్శకుడు సియస్ రావు ఆ చిత్రాన్ని పూర్తిచేసారు.
మహాకవి క్షేత్రయ్య విడుదల (31.3.1976) సందర్భంగా హైదరాబాద్‌కు ప్రత్యేకంగా విచ్చేసి పాత్రికేయులతో ముచ్చటిస్తున్న అంజలీదేవి. నిర్మాత సంగీత దర్శకుడు పి.ఆదినారాయణరావు, దర్శకుడు సియస్ రావు పై చిత్రంలో చూడవచ్చు.

-పర్చా శరత్‌కుమార్ 9849601717