Others

వెనుకటి ‘బీడీ’లు ఏల మానురా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహమ్మద్ నిషామ్ అంటే కేరళలో బీడీలు కాల్చే వాళ్లకే కాదు బీడీల బిజినెస్ చేసే యావత్ ప్రపంచానికీ తెలుసు. కాకపోతే రుూ బీడీల మహారాజు ప్రస్తుతం త్రిశూర్ జైల్లో- జనవరి నెలనుంచీ యావజ్జీవ కారాగారశిక్ష హాయిగా ఎంజాయ్ చేస్తున్నాడంటే అతిశయోక్తి కాదు.
ఈ మహమ్మద్ నిషామ్ పోయినేడాది చంద్రబోస్ అనే సెక్యూరిటీ గార్డుని- తన గుట్టు వెల్లడించాడన్న కోపంతో తన ‘సువ్’ మోటారు శకటంతో మట్టేసి దారుణంగా చంపేశాడు. గోడకి అతుక్కుపోయేలాగా ఆ పేదవాణ్ని తన శకటంతో నొక్కేశాడు. ఆనక ఏడు వందల మీటర్ల దూరం రుూడ్చుకుపోయి తొక్కి తొక్కి చంపేశాడు. సదరు కేసులో యావజ్జీవ కారాగారశిక్ష పడ్డాక, నిషామ్ జనాబ్- తనను కారాగారానికి బీడీలతోగాక బేడీలతో తరలిస్తున్న అయిదుగురు పోలీసు భటుల్ని దారిలో బ్రహ్మాండమైన విందు పెట్టించి మరీ జైలు సామ్రాజ్యంలోకి ప్రవేశించాడు.
ఇప్పుడతను- ‘‘జైలులో నుంటేనేమి మొబైల్సు వుండునంతదనుక’’ అంటూ బీడీల అక్రమ వ్యాపారం ఝామ్మని చలాయిస్తున్నాడని- అతని బంధువే అతనిమీద కేసుపెట్టారు. ‘తిరునల్వేలి కింగ్ బీడీ ఫ్యాక్టరీ అతనిదే! కారాగారం నుంచే తన శత్రువుల్ని చంపేస్తానొరేయ్! నా జోలికి రాకండి’’ అంటూ బెదిరిస్తున్నాడుట.
ఇతనికి పోలీసు అండదండలున్నాయిట. సమర్థుడైన వ్యాపారికి చెరలో వున్నా, అడవిలో వున్నా బిజినెస్ బ్రహ్మాండంగా నెరపగల దమ్ముంటుందని 39 సంవత్సరాల రుూ ‘బీడీ రాజు’ రుజూ చేస్తున్నాడు. నేరమేరా శాశ్వతం!!

-వీరాజీ