Others

రెండుసార్లు జన్మించిన పాపాయి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘అయోనిజ- సీత’ - అన్నమాట విన్నాం. ఆధునిక కాలంలో ‘అన్యగర్భజ’లు పుట్టగా చూస్తున్నాం. గానీ అక్షరాలా రెండుసార్లు జన్మించిన పాప- విన్లీ హూప్.
అమెరికా టెక్సాస్‌కి చెందిన ప్లానో అనే నగరానికి చెందిన గర్భవతి- మార్గరెట్ బోలియర్ ఆసుపత్రికి పోయి అల్ట్రాసౌండ్ పరీక్ష చేయించుకున్నది.
‘‘కవలలున్నారు కాబోలు’’ అనుకుంటూ వెళ్లిందామె ఆసుపత్రికి, కానీ వైద్యులు షాక్ తిన్నారు. ఆమె గర్భంలో ఒక పిండం దానితోపాటే అంత పెద్దదిగానూ పెరిగిన ‘కణితి’ వున్నాయి. ఈ గ్రంధి పాపమీద పరాన్నభుక్కుగా పెరిగిపోతోంది. డాక్టర్ రైల్ కాస్ మొదట గర్భస్రావం మంచిది అన్నాడు కానీ, ఆనక, యింతవరకూ కని వినీ ఎరుగని శస్త్ర చికిత్స చేద్దామనుకున్నాడు. పిండానికి ఇరవై నాలుగు వారాల వయసు రాంగానే- తల్లి గర్భాశయాన్ని ‘చీల్చి’ అందులోని పిండాన్నీ, దాని అంటిపెట్టుకున్న కణితినీ తీసేశారు- అప్పటికి దాని బరువు ఒక పౌను, మూడు ఔన్సులు మాత్రమే! ఒక ఇరవై నిమిషాలు గర్భసంచీ వెలుపల రుూ పిండానికి అతి అరుదైన ప్రపంచంలోనే తొలిసారి చేస్తున్న శస్తచ్రికిత్స చేశారు.
ఆ కణితి రక్తాన్ని చాలావరకూ త్రాగేస్తున్నందువలన రుూ పిండానికి కృత్రిమ రక్తప్రసరణ కల్పించారు. శస్తచ్రికిత్స అనంతరం రుూ ఇరవై నాలుగు వారాల పిండాన్ని కాబోయే తల్లి గర్భసంచిలో పెట్టి దాన్ని జాగ్రత్తగా కుట్టేశారు. అటు తర్వాత పనె్నండు వారాలకి ‘బేబీ’ తయారైంది. తిరిగి సిజేరియన్ శస్త్ర చికిత్స ద్వారా పాపని భూమీదికి అవతరింపజేశారు. బేబీ అయిదు పౌన్ల అయిదు ఔన్సుల బరువు తూగింది. కాకపోతే బిడ్డను ఆ తల్లికి వెంటనే చూపించలేదు. తర్వాత యింత చక్కటి పునర్జన్మ పొందిన తన పాపాయిని ఆమె చూసుకుని మురిసిపోయింది.
దీన్ని పురాణగాథ అంటామా? ఆధునిక వైద్య ఘనత అంటామా? ‘విల్లీహూప్’ మాత్రం ఒక కొత్త హోప్‌ని అందరికీ ఇస్తున్నది! గ్రేట్!

-వీరాజీ