Others

భలే పందెం:పాపం! వ్యాఖ్యాత!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెట్టింగులు, పందేలు క్రీడారంగంలో ఎక్కువగానే వుంటాయి గానీ, యిదో తమాషా బెట్. మొన్న ఆదివారం మొహాలీలో ఇండియాకి ఘనవిజయంగా ముగిసిన న్యూజిలాండ్ ఒన్‌డే మ్యాచ్ సాగుతుండగా కామెంటేటర్లలో ఒకడయిన స్కాట్ స్టెయిరిస్ చురుగ్గా వ్యాఖ్యానం చేస్తూ కేదార్ జాధవ్ బౌలింగ్‌కు రాగానే సహచర ప్రత్యక్ష వ్యాఖ్యాతలయిన సునీల్, సంజయ్, రవిశాస్ర్తీ ప్రభృతుల సమక్షంలో - ‘ఐ బెట్’ అంటూ సీరియస్‌గా పందెం కాస్తున్న మొహం పెట్టి- ‘‘ఈ కేదార్ జాధవ్ గనుక న్యూజిలాండ్ వికెట్‌ని పడగొడితే నేను తక్షణం కామెంటరీ బాక్సునుంచి బయటికిపోయి న్యూజిల్యాండ్‌కి విమానం ఎక్కేస్తాను’’ అన్నాడు. ఇది నోరు జారడమే అనాలి. జాధవ్ మూడు వికెట్లు తీసుకున్నాడు. స్టైరిస్ ఒక్కసారే వాక్‌ఔట్ చేయగలిగాడు. ‘నోరా బుర్రకి తీసుకురాకే!’ అంటే యిదే మరి!

-వీరాజీ