Others

గృహిణే సర్వం - గృహమే స్వర్గం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మానవ జీవితానికి పూర్ణత్వాన్ని సిద్ధింపజేయడానికి అవశ్యకమైన శాంతి, సౌభాగ్యం, సంతృప్తి గృహం నుంచే లభిస్తాయి. భారతీయ సనాతన ధర్మంలో గృహస్థాశ్రమానికి వున్న విలువ వెలకట్టలేనిది. అందుకే ‘గృహమే కదా స్వర్గసీమ’ అని విజ్ఞులు గృహాన్ని స్వర్గంతో పోల్చి చెప్పారు. గృహస్థు యొక్క జీవన విధానాన్ని ఋషులు ఆశ్రమ ధర్మంగా అభివర్ణించారు. నిష్ఠాగరిష్ఠమైన ఆశ్రమ ధర్మంలో నియతి, నియమావళి వుంటాయి.
ప్రపంచంలో మానవాళి సర్వతోముఖ వికాసానికి, సమాజ విస్తృతికి గృహమే మూలకేంద్రం. కఠోరమైన నియమాలతో కూడుకున్న సన్యాసాశ్రమ ధర్మం ఋషులకు ఆచరణీయమైనా సప్త ఋషులలో ప్రముఖులైన అత్రి, అగస్త్యుడు లాంటివాళ్ళు అనసూయ, అరుంధతీ వంటి సాధ్వీమణులను వివాహం చేసుకొని గృహస్థాశ్రమ ధర్మం యొక్క ప్రాధాన్యతను లోకానికి చాటారు. మానవ జీవితాన్ని సుఖమయం చేసుకోవడానికి ధన, కనక, భూ, గృహ, వస్తు, వాహనాదులే ముఖ్యమైనవని భావించడం పొరపాటు. ఇవన్నీ భౌతిక అవసరాలు తీర్చేవే. ఎన్ని సంపదలున్ననూ శాంతిలేని జీవితం ఎండమావి తో సమానం.
గృహానికి అలంకారం గృహిణి. మర్యాద, మన్నన తెలిసి సంస్కారం, సద్గుణాలతో శోభిల్లే ఆదర్శవంతురాలైన
ఇల్లాలు ఏ ఇంటికైనా వెలుగు. అందుకే ‘ఇంటికి దీపం ఇల్లాలే’ అన్న నానుడి ప్రచారంలోకి వచ్చింది. సుగుణవతియైన ఇల్లాలు ఇంటికి వెలుగవుతుంది. కుటుంబానికి, వంశానికి గౌరవం తెచ్చే మహిళగా మన్నన పొందుతుంది. జీవితంలో శక్తిస్వరూపానికి ప్రతిరూపమైన స్ర్తిమూర్తి పోషించే విభిన్న భూమికలు కుటుంబాన్ని, సమాజాన్ని, దేశాన్ని కూడా ఉద్ధరింపజేస్తాయి అనడంలో సందేహం లేదు.
సమాజాన్ని సంస్కారవంతంగా తయారుచేయడంలో మహిళ పాత్ర ముఖ్యమైనది. తల్లిగా, ఆలిగా, సోదరిగా, కూతురిగా, కోడలిగా అన్ని విధాలుగా కుటుంబ నిర్వహణకు దోహదపడే స్ర్తిమూర్తి వంశాభివృద్ధికి, సమాజ శ్రేయస్సుకి మూలహేతువు. ఒక మంచి తల్లి పిల్లల్ని సంస్కారవంతులుగా, విద్యావంతులుగా వినయ వివేకాలతో తీర్చిదిద్దుతుంది. భర్తతో ప్రేమానురాగాలతో సంసారాన్ని కొనసాగించడంలోనే కాక జీవిత భాగస్వామికి కావాల్సిన అన్ని అవసరాలను ముందుగానే గ్రహించి సమయోచితంగా వాటిని తీర్చడంలోను సహకరిస్తుంది. మానసికంగా భర్తకు అవసరమయ్యే బలాన్ని, మనోధైర్యాన్ని అందించడంలో ఏ ఇంటిలోనైనా భార్య పాత్ర అత్యంత కీలకం. సుఖాన్ని, కష్టాన్ని కూడా భర్తనుంచి సమానంగా స్వీకరిస్తుంది. క్లిష్ట సమయాల్లో నిర్ణయాలు తీసుకునేటప్పుడు భర్తకు వివేకంతో మార్గనిర్దేశనం చేస్తూ సహధర్మచారిణి అన్న మాటను సార్థకం చేసుకుంటుంది. బాధ్యత తెలిసిన ఇంటి ఇల్లాలు కేవలం భర్తకే కాక అత్తమామలకు, ఇతర కుటుంబ సభ్యులకు ఆత్మీయంగా సేవలందిస్తుంది. బంధువులను, ఆత్మీయులను ఆదరించడంలో కనబరిచే ఆప్యాయత, అతిథులపట్ల చూపే మర్యాదపూర్వకమైన ప్రవర్తనవల్లనే ఏ కుటుంబానికైనా గౌరవం లభిస్తుంది. సాధ్వీమణి సీతాదేవి శ్రీరాముని సహధర్మచారిణిగా భర్త అడుగుజాడల్లో కష్టసుఖాల్లో కలిసి నడిచి స్ర్తి పాతివ్రత్యాలికి ప్రసిద్ధ ఉదాహరణగా నిలిచి మానవాళి హృదయాల్లో నిత్య నీరాజనాలు అందుకుంటుంది. యుగాలు గడిచినా ఆదర్శ నారిగా ధార్మికము, సంస్కారయుతము అయిన ఆమె జీవనం మహిళా లోకానికి ఆచరణీయ మార్గంగా వుంది.

-రాజ్‌కుమార్