Others

ఔషధాల గని ఉసిరి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మనకు నిత్యం లభించే ఉసిరికాయ ఉపయోగం ఏమిటా అని ఆలోచిస్తున్నారా! ఉసిరికాయలో ఆరోగ్యానికి మేలు చేసే గుణాలున్నాయి. ఆయుర్వేదంలో సైతం ఉసిరికి ప్రాముఖ్యతుంది. ఉసిరికాయలో సి విటమిన్, ఐరన్, కాలి షయం పుష్కలం గా వున్నాయి. రక్తా న్ని శుద్ధి చేసే గుణం ఉసిరిలో వున్నది. ఉసిరికాయ తినడంవలన గుండె జబ్బు లు దరిచేరవు. మూత్ర సంబంధమైన వ్యాధులు అదుపులోకి తెచ్చే గుణం ఉసిరిలో వున్నది. వగరు వగరుగా వున్న ఉసిరికాయలను తినడంవలన వృద్ధాప్య లక్షణాలు నశించి యవ్వనకాంతి చేకూరుతుంది. రోగనిరోధక శక్తి లభిస్తుంది. జుట్టు తెల్లబడటాన్ని నిరోధించి శిరోజాలు నిగనిగలాడేలా చేసే శక్తి ఉసిరికాయలో వుంది. హెయిర్ ఆయిల్‌లోనూ మందులలోను ఉసిరిని ఉపయోగిస్తారు. స్ర్తి చర్మకాంతి సౌందర్యం పెంపొందిస్తుంది. ముఖ్యంగా ఎముకల్ని బలిష్టంగా చేస్తుంది. దంత సంరక్షణకు మంచిది. కంటికి మంచిది. అజీర్ణం నివారిస్తుంది. మూత్రాశయంలో రాళ్ళను ఏర్పడకుండా చూస్తుంది. కాలేయాన్ని కాపాడుతుంది. ఉసిరి పచ్చడి ఆరోగ్యకారి. ఉసిరిలో వుండే పీచుపదార్థం వలన శరీరానికి పోషక విలువలు అందించగలదు. కడుపులో మంటను రాకుండా చేయగలదు. కామెర్ల రక్షణకు తోడ్పడగలదు. కాస్మటిక్స్‌లో సైతం ఉసిరిని ఉపయోగించడం విశేషం.
**
భూమికకు రచనలు
పంపాలనుకునే వారు
రచనలను
ఈ మెయిల్‌లో స్కాన్ లేదా
పిడిఎఫ్ ఫార్మాట్‌లో bhoomika@andhrabhoomi.netకు మెయల్ చేయవచ్చు.
లేదాఈకింది చిరునామాకు
పంపగలరు.
మా చిరునామా :
ఎడిటర్, ఆంధ్రభూమి దినపత్రిక
36, సరోజినీదేవి రోడ్
సికిందరాబాద్- 03

- ఎల్.ప్రపుల్లచంద్ర