Others

పండుగ వేళ..పెట్స్ పదిలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దీపావళి జీవితాల్లో వెలుగులను నింపటమే కాదు ఏమా త్రం అజాగ్రత్తగా ఉంటే అంతేస్థాయిలో విషాదాన్ని నింపేస్తోంది. ముఖ్యంగా బాణసం చా కాల్చేరోజూ పసి బిడ్డలకు, ఇంట్లో పెంపుడు జంతువులకు భయానకమైనదేనని చెప్పవచ్చు. మరి ఆరోజు బోసి నవ్వుల పాపాయిలు కమ్మగా నిద్రపోవాలంటే.. బొచ్చు నేస్తాలు సౌకర్యవంతంగా, సురక్షితంగా ఉండాలంటే ఈ కింది జాగ్రత్తలు తీసుకోక తప్పదు.
టపాసుల శబ్ధానికి పెంపుడు జంతువులు ఇంటి నుంచి బయటకు పరుగులు పెడుతుంటాయి. అవి తప్పిపోకుండా ఉండాలంటే వాటి పేరు, ఫోన్ నెంబర్‌తో టాగ్ తయారుచేసి మెడలో వేయండి. ఒకవేళ పెంపుడు కుక్క కిటికీ లేదా మెయిన్ గేటు నుంచి పారిపోయినట్లయితే ఎవరైనా పట్టుకున్నా మీ వద్దకు చేర్చుతారు. మార్కెట్లో విభిన్న రకాల టాగ్స్, గుర్తింపు కార్డులు లభిస్తున్నాయి. గత దీపావళి పండుగనాడు మీ కుక్క ప్రవర్తించిన తీరును బట్టి టాగ్స్‌ను గానీ, గుర్తింపు కార్డులను ఎంపికచేసుకుంటే మేలు.
బయటకు జారకుండా పట్టీలు లేదా తొడుగులు లేదా మార్టింగేల్ పట్టీలను వాడండి.
కుక్కలను ఒంటరిగా ఉంచవద్దు. క్రాకర్స్ శబ్ధాలు తగ్గేవరకు వాటిని జాగ్రత్తగా నలుగురి మధ్య తిరిగేలా చేయండి.
ఇంట్లోని తలుపులు, గేట్లు, కిటికీలు ఆరోజంతా మూసి వుంచండి.
పెంపుడు జంతువులు సురక్షితంగా ఉండే స్థలాన్ని ఎంపిక చేసుకోండి. అనువైన స్థలాన్ని ఎంపికచేస్తే అవి కులాసాగా ఉంటాయి.
వైద్యుడిని కలిసి ఫస్ట్ ఎయిడ్ చికిత్స కిట్‌ను దగ్గర పెట్టుకోవటం మంచిది.
నిశ్శబ్ధ సమయాల్లోనూ, శబ్ధం వచ్చేటపుడు కుక్కలు ఎలా ప్రవర్తిస్తున్నాయో పరిశీలించండి. వాటికి ఏమాత్రం భయం వేసినా పారిపోతాయి.
బయటకు తీసుకువెళ్లేటపుడు కాల్చిన క్రాకర్స్ మీదుగా తీసుకువెళ్లవద్దు. సరిగా కాలని క్రాకర్స్‌ను నోటితో పట్టుకుంటే గాయపడతాయ. కుక్కలను ఇంటికి తీసుకురాగానే వాటి కాళ్లను శుభ్రం చేయండి.
పండుగ రోజు క్రాకర్స్ శబ్ధాలకు పెంపుడు జంతువులు ఒత్తిడికి గురవుతాయి. అవి ఆహారాన్ని ముట్టుకోవు. అవి తినేటట్లు బలవంతం చేయవద్దు. వాటికి దగ్గరలో శుభ్రమైన, జీర్ణమైయ్యే ఆహారాన్ని, నీళ్లను ఏర్పాటుచేయండి. పిల్లలను కూడా వాటి వద్దకు వెళ్లనీయకండి.
పండుగకు రెండు రోజుల ముందుగానే పిల్లలు టపాసులు కాలుస్తుంటారు. దీంతో ఆ శబ్ధాలకు అవి ఉలిక్కిపడుతూ భయంగానూ, విచారంగానూ ఉన్నట్లు గమనించినట్లయితే వాటితో కాసేపు సరదాగా టగ్ ఆఫ్ వార్ వంటివి ఆడుకోండి. ఇంట్లో సంతోషకరమైన వాతావరణం ఉంటే పప్పీలు ఎలాంటి భయానకు లోనుకాకుండా ఆనందంగా ఉంటాయి.
పెంపుడు జంతువులకు సరిగా సేవ చేయకపోయినా..రుచికరంగా ఆహారాన్ని అందించకపోయినా భయానికి లోనవుతాయి. మీరు ఆత్మవిశ్వాసంగా ప్రవర్తిస్తే అవి కూడా అలాగే ఉంటాయి.
ఫ్యాన్సీ లైట్లను, టపాసులను వాసన చూస్తాయి. జాగ్రత్తలు తీసుకోపోతే అనారోగ్యం పాలవుతాయి. గాయపడవచ్చు.
ఇంట్లో ఉన్న స్వీట్లు, ఇంపైన వంటలను వాటికి పెట్టవద్దు. ఒక్కొక్కసారి అవి ప్రాణానికి ముప్పు తెస్తాయి. ఆనందంగా జరుపుకోవాల్సిన దీపావళి విషాదాన్ని నింపకుండా ఉండాలంటే కుక్కలను, పసి బిడ్డలను క్రాకర్స్‌కు, దీపాలకు దూరంగా ఉం చటం ఎంతో మేలు.