Others

సుస్వరాల దీపావళి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అదిగో!.. అంతటా జన సందోహాల నాదమయమైన వెనె్నల వెలుగులు.
కంటికింపైన కెంపుల మెరుపుల జీవస్వరాలు
మనసుతో ఊపిరి పోసుకుని
పదాలకు ప్రాణప్రతిష్ఠ చేసి
వీచే చల్లని గాలుల తాళధ్వనుల మధ్య
నర్తించే మనోజ్ఞ మహోజ్వల తళుకులు
దేదీప్యమానమైన దీపరాశుల కొంగ్రొత్త సొబగులవిగో
నేల నుండి నింగి వరకు..!
బతుకు పయనం ప్రశ్నార్థక అక్షయ తోరణమే కావచ్చుకానీ
తెలియకపోవడం చీకటైతే
తెలియడం వెలుగు
అజ్ఞానాంధకారం తిమిరమైతే
జ్ఞాన ప్రకాశం కదా కాంతి..!

అగ్ని కనిపించనంత మాత్రాన అస్థిత్వం సమసిపోనట్టు
అసమానతలు, పరస్పర ద్వేషాలు లేని కాంచన దీపం!
మహోన్నత సంస్కృతి, సమున్నత సాహిత్యాల
చైతన్య మణిహారం!
కఠినమైన కాళరాత్రుల్లో
ఉచ్ఛ్వాస నిశ్వాసాల శబ్దం కూడా వినపడేంత నిశ్శబ్దం ఆవరించినప్పుడు సహితం
వీరుడి వదనంలో విజయం తనదనే చిరుమందహాసం!

సమిష్టి శ్రేయస్సు కోసం తరిపించే సహృదయుల ప్రాతఃకాల ప్రధమ కిరణం
ఆనందాతిరేకంతో మెడని సారించి కూతవేసి రెక్కలు రెపరెపలాడించినప్పుడు రాలిన నెమలి కన్ను..
తనివితీరా బిడ్డకు పాలిచ్చిన పాడియావు మెడలోని చిరుమువ్వల సవ్వడి..
మనిషి తోటి మనిషివైపు చూసే నిర్మలమైన చూపుల్లా
ఎన్నటికి అలిసిపోనీయని ‘ప్రేమే’
సుస్వరాల దీపావళి..!!

-బులుసు సరోజినీదేవి 9866190548