Others

వెలుగుల రవళి..దీపావళి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హిందూమత సంస్కృతికీ, సంప్రదాయానికీ చిహ్నం ‘దీపావళి’ పర్వదినం. తెలుగువారు ఈ పండుగను దివ్వెల పండుగ అని అంటారు. శ్రీరామచంద్రుడు పట్ట్భాషిక్తుడైన రోజు. రాక్షసరాజైన బలి చక్రవర్తిని వామనమూర్తి పాతాళలోకానికి అణచివేసిన దినం. వీణను కూడా పట్టుకోవటం చేతకాని సుకుమారి సత్యభామ విల్లును చేతబట్టి బాణాల వర్షం కురిపించి రాక్షస సైన్యాన్ని తరిమిన శుభదినం. చీకటిని వెలుతురు పారద్రోలినట్లుగా నరకాసుర వధ జరిగిన రోజున ప్రజలు దీపాలు వెలిగించి దీపావళి జరుపుకుంటారు. లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైన ఈ పండుగనాడు ఆ తల్లి భూలోకానికి వచ్చి ఇల్లిల్లూ తిరుగుతుందనే విశ్వాసంతో దీపమాలికలతో నీరాజనమిస్తారు. చీకటి నుంచి వెలుగులోకి వచ్చేందుకు ‘తమసోమా జ్యోతిర్గమయా’ అని మనసారా చేసే ప్రార్థనకు మచ్చుతునక .