Others

పునఃసృష్టి ప్రయోగాలు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సినిమాలో ప్రేక్షకుడి అంచనాకు దొరకని అంశం ఏదోకటి తెరపై కనిపిస్తే -ఆశ్చర్యపడతాడు. వౌత్‌టాక్‌తో సినిమా పబ్లిసిటీని పెంచేస్తాడు. అన్నింటికి మించి తన అభిమాన హీరో గెస్ట్ అప్పీయరెన్స్ ఇస్తే ఇంకేముంది -సినిమాకు పట్టంకట్టేస్తాడు. దీనికోసం పాతతరం నుంచి నేటితరం వరకూ ఇలాంటి బోనస్ సన్నివేశాలను పెట్టడానికి -దర్శకులు ఎక్కువ మక్కువ చూపుతున్నారు.
ఒకప్పటి పరిస్థితినీ పరిశీలిస్తే -దాసరి తన ‘శివరంజని’ సినిమాలో ఏకంగా చాలామంది స్టార్ హీరో, హీరోయిన్లను తెరపై చూపించి ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. హీరో కృష్ణ సైతం ‘దేవుడుచేసిన మనుషులు’ చిత్రంలో ఎక్కువమంది నటీనటులతో ప్రేక్షకులను మెస్మరైజ్ చేశాడు. ప్రస్తుతం దీనికి భిన్నంగా గ్రాఫిక్ వర్క్‌తో సినీలోకాన్ని వదిలి వెళ్ళిన నటులను వెండితెరపై తిరిగి ఆవిష్కరించే పనిలో దర్శకులు పడ్డారు. వెంకటేష్ నటించిన ‘కలిసుందాం..రా!’ చిత్రంలో ఎన్టీఆర్‌ని చూపించే ప్రయత్నం చేశాడు దర్శకుడు. ఆయన సినిమాల్లోని డాన్స్ క్లిప్పింగ్స్‌ని వాడి, వెంకటేష్, సిమ్రాన్‌లతో డాన్స్ చేసినట్టుగా మిక్స్ చేసారు. అప్పట్లో ‘నచ్చావే పాలపిట్ట..’ అనే పాట పాపులారిటీతో పాటు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. సినిమాకు రిపీట్ ఆడియెన్స్‌ని రప్పించింది. తర్వాత రాజవౌళి గ్రాఫిక్ మాయాజాలంతో జూ.ఎన్టీఆర్‌తో ఎన్టీఆర్ డైలాగ్ వెర్షన్‌ని ‘యమదొంగ’ సినిమాలో పెట్టి సీన్‌ని బాగా రక్తికట్టించాడు. ఇది కూడా నందమూరి అభిమానులను కేరింతలు కొట్టేలాచేసింది.
ఇటీవల బ్రహ్మోత్సవంలో రావు రమేష్‌కు సలహాలిచ్చే గ్రాఫిక్ పాత్రధారిగా రావు గోపాల్రావును సృష్టించి స్క్రీన్‌పై ఆవిష్కరించడం జరిగింది. అంతకంతకూ విస్తరిస్తున్న టెక్నాలజీకి ఇందుకు అనుకూలంగా వాడుకుంటున్నారు. ఇటీవల కన్నడ వర్షన్‌గా వచ్చిన ‘నాగభరణం’ సినిమాలో కన్నడ పాపులర్ స్టార్ విష్ణువర్ధన్‌ను దర్శకుడు కోడి రామకృష్ణ గ్రాఫిక్ మాయాజాలంతో పునఃసృష్టించి సినిమా రేటింగ్‌ను పెంచుకునే ప్రయత్నం చేశాడు. ఈ సినిమా క్లైమాక్స్‌లో ఫైట్ సన్నివేశంలో విష్ణువర్ధన్ వీరోచితంగా పోరాటం చేయడం చూస్తుంటే రానున్న రోజుల్లో వైభవంగా వెలిగిన ఎందరో నటీనటులు సినిమాల్లో సందడి చేస్తారేమో అనిపిస్తుంది. అందానికి చిరునామా ‘సావిత్రి’, గాంభీర్యానికి ప్రతీక ‘ఎస్వీఆర్’.. ‘ఎన్టీఆర్’, సాంఘిక కథానాయకుడు ‘ఏ.ఎన్.ఆర్.’, రొమాంటిక్ హీరో ‘శోభన్‌బాబు’.. ఇలా ఎందరినో దర్శకులు సృష్టించి మళ్ళీ ప్రేక్షకులకు పరిచయం చేస్తారేమో? అయితే ఇది సినిమా నిడివి అంతా సాధ్యంకాదు. పైగా భారీ ఖర్చుతో కూడుకున్నది కనుక వీరంతా అతిథులుగా కనిపించే అవకాశమే ఎక్కువ. ఏదైనా ప్రేక్షకులకు కిక్‌నిచ్చే విధంగావుంటే సినిమాను మోసెయ్యడం కామన్ కనుక -ఇలాంటి సన్నివేశాలు వచ్చే సినిమాల్లో మరింత కనిపిస్తాయని ఆశించొచ్చు. సృష్టికి ప్రతిసృష్టిగా వచ్చే ఈ తరహా పాత్రలు ఎంతవరకు పర్‌ఫెక్ట్‌గా రూపొందుతాయన్నది ప్రశ్న. ఒకవేళ రూపొందినా పాత్ర పోషణ తీరు ఎంతవరకు న్యాయం చేస్తుంది? ఇలా చేయడంవల్ల ప్రేక్షకులు రానున్న రోజుల్లో ఎంతవరకు థ్రిల్‌కి గురౌతారు? అసలు ఇలాంటి పాత్రలను ఎవరు సృష్టిస్తారు? వంటి అనేక ప్రశ్నలు వినిపిస్తాయి. అయితే ఒకటి మాత్రం ఖాయం. చాలామంది ప్రముఖులకు సొంత బ్యానర్లు ఉండటం వలన ఎన్టీఆర్- ఏఎన్‌ఆర్, రామానాయుడు.. అల్లు రామలింగయ్య వంటి పాత్రలు పునఃసృష్టికి వచ్చే అవకాశం వుంది. అల్లు పాత్ర వస్తే సరిజోడుగా రావుగోపాలరావు పాత్ర కూడా తెరపైకి వచ్చే ఛాన్స్ లేకపోలేదు. పునఃసృష్టి పాత్రలను కేవలం ఒక్క షాట్‌లో చూపిస్తే చాలని భావిస్తే -ప్రేక్షకులు వాటిని అంతగా ఆదరించరు. అలాగని నిడివి ఎక్కువ నడిపిస్తే భారీగా ఖర్చవుతుంది. అయినాసరే సబ్జెక్ట్‌లో ఆయా పాత్రలకు సరైన ప్రాధాన్యత ఉంటే అగ్ర నిర్మాణ సంస్థలు ఇలాంటి పాత్రలను తప్పక సృష్టిస్తాయనే చెప్పాలి. ఎంతైనా ఇలాంటి పాత్రలు కొంతకాలమే అలరిస్తాయన్నది వాస్తవం. ఇలాంటి పాత్రవలన నటులు సజీవంగా నిలిచి పోతారనడంలో సందేహం లేదు.

-బాసు