Others

అమ్మ తోడు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కెరీర్ ముగింపు దశలోకి వచ్చేసిందన్న విషయాన్ని గమనించేసింది అందాల భామ త్రిష! ఇక నటనకు ప్రాధాన్యం ఉన్న ఓ చిత్రంలో నటించాలని ఆలోచిస్తోంది. అందుకే తమిళనాడులో ప్రస్తుతం ఎక్కడ చూసినా అమ్మ నామం జపిస్తున్నారు కనుక, అలాంటి ఓ చిత్రంలో నటిస్తే బావుంటుందనుకుంది. అందుకే అమ్మ బయోపిక్‌లో నటించాలని ఉందని తన మనస్సులో మాట బయటపెట్టేసింది. దీంతో కోలీవుడ్‌లో దర్శక, నిర్మాతలకు ఓ మంచి ఆలోచన కూడా ఇచ్చినట్లైంది. తమిళనాడు రాజకీయాల్లో జయలలిత పాత్ర ఎన్నదగినదే. అందుకే అలాంటి కథైతే పేరుకు పేరు, మళ్లీ అవకాశాలు వస్తాయని ఆశిస్తోంది త్రిష! అమ్మ పాత్రలో నటించడం ద్వారా సిఎంగా అందరికీ కనిపించే అవకాశం దక్కుతుందని, అదే తనకు అదృష్టాన్నిస్తోందని చెబుతోంది. త్రిష కోరిక ఓకే. కానీ అడుగు ముందుకేసేది ఎవరు?