Others

నాకు నచ్చిన చిత్రం వరకట్నం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరకట్న దురాచారానికి సమాజంలో బలవుతున్న ఆడపిల్లలు, కుటుంబాల దయనీయ పరిస్థితి, తీరుతెన్నులను నందమూరి సోదరులు హృద్యంగా చిత్రీకరించి నిర్మించిన సామాజిక సందేశాత్మక కుటుంబ కథాచిత్రం -వరకట్నం. అప్పటి వరకూ పౌరాణిక, జానపద చిత్రాలకు దర్శకత్వం వహించిన ఎన్టీ రామారావు తొలిసారిగా ఒక సామాజిక సమస్యను కథాంశంగా తీసుకొని దర్శకత్వం వహించిన చిత్రమిది. చిత్రంలో ఎన్టీఆర్, కృష్ణకుమారి నాయకా నాయికలు. సంక్రాంతి సినిమాగా 1969 జనవరి 9న విడుదలైన ‘వరకట్నం’ ఇతివృత్తం ప్రత్యేకత కలిగిందే! దీనికి సాధారణ (రెండు కేంద్రాల్లో శతదినోత్సవం) విజయమే లభించినా, రాష్ట్ర ప్రభుత్వం నుంచి ద్వితీయ ఉత్తమ చిత్రంగా రజత పతకం పొందడమే కాదు, 1982లో రెండోసారి విడుదలై శత దినోత్సవం జరుపుకుంది. భారీ బడ్జెట్‌కు పోకుండా కథను నమ్ముకుని, పాత్రధారుల ఎంపికలో ప్రయోగాలు, రిస్కులు చేయడం ఎన్టీఆర్‌కు అలవాటు. అలా వరకట్నంలోనూ కొన్ని ప్రయోగాలు చేశారు. విలన్ పాత్రలు పోషిస్తూ అప్పటికి అంతగా గుర్తింపులేని సత్యనారాయణను నాయిక అన్నగా మంచివాడిగా చూపించారు. అతని భార్యగా అగ్రకథానాయక, మహానటి సావిత్రిని చూపించటం విశేషం. ఈ చిత్రంలో విలన్ పాత్రధారి అయిన రాజనాలపై ఘంటసాల గానం చేసిన ‘సైసై జోడెడ్ల బండీ, బండీ సోకైన దొరలా బండీ’ అనే సూపర్ హిట్ పాటను చిత్రీకరించడం సాహసోపేత ప్రయోగమే. తల్లిదండ్రులుగా నాగభూషణం, హేమలతలకు కథలో మంచి ప్రాధాన్యత ఇవ్వడమే కాకుండా, నాగభూషణం పాత్రను కోపధారిగా, కొడుకుపట్ల ప్రేమగల తండ్రిగా డైలాగ్ మాడ్యులేషన్‌లో ప్రత్యేక ఒరవడి ప్రవేశపెట్టారు. కొడుకు పెళ్లి ఆగిపోయిందన్న బాధతో అల్లుడిని విమర్శించే సన్నివేశంలో, ఇంకా పలు సన్నివేశాల్లో హేమలత నిండుతనంతో మెప్పించారు. డబ్బు దురాశ కలిగిన సూర్యకాంతం, సమయానికి కట్నం ఇవ్వలేకపోయిన కోడల్ని, ఆమె కుటుంబాన్ని వేధించే పాత్రతో రక్తికట్టించారు. భార్యకు ఎదురు చెప్పలేని సగటు భర్తగా రేలంగి, అమ్మకు భయపడే కొడుకుగా పద్మనాభం, అతని జోడిగా చంద్రకళ, ఆమె తండ్రిగా పెరుమాళ్ళు వారి వారి పాత్రలకు పూర్తి న్యాయం చేస్తూ చిత్రానికి ప్రాణం పోశారు. హీరోయిన్‌గా కృష్ణకుమారి అందచందాలు, ఆమె వదినగా సావిత్రి నటన చిత్రానికి హైలెట్. వీరిద్దరిపై మరదలా మరదలా పాట ఆకట్టుకుంటుంది. విభిన్నమైన సందేశాత్మక చిత్రం. ఆధునిక తరానికీ ఎంతో నచ్చే సినిమా.

-పివిఎస్ ప్రసాదరావు