Others

అక్కడ ‘సెల్ఫీ’లు నిషేధం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సెల్ఫీలు తీసుకునే వెర్రి వ్యామోహం అమెరికా అధ్యక్షుడు ఒబామా దగ్గరనుంచి మన ప్రధానమంత్రి మోదీగారి దాకా వ్యాపించి పోయింది. యువతీ యువకులు సెల్ఫీలు తీసుకునే వెర్రి వ్యామోహంలో చాలాసార్లు నిండు ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. కొండ అంచున, లోయ లోపల, పులి బోను లోపల, జలపాతం కింద - యిలా ఒక దగ్గర అని లేదు. ప్రాణాపాయం గల ఏ నేపథ్యం దొరికినా యువతీ యువకులు- మొహాలు దగ్గిర చేర్చి, చెంపకి చెంప ఆనించి సెల్ఫీలు నొక్కుకుంటున్నారు. ఈ ప్రయత్నంలో అలా, ఫోకస్ చేసుకుంటూ కాలు జారి అంతే సంగతులయిపోతున్నారు. ముంబాయిలో టూరిస్టులుగా, లవర్స్‌గా, సాహసికులుగా ‘‘వచ్చే సెల్ఫీ మొబైల్ ఫోన్‌గాళ్ల’’ ఆత్రానికి ఆనకట్ట వెయ్యాలని ముంబాయి పోలీసుశాఖ- ఒక సర్వేచేసి మొత్తంమీద 16 ప్రమాదకరమైన జాగాలని ‘లిస్టు’చేసింది. ఈ ప్రదేశాలలో సెల్ఫీలు తీసుకోడం నిషేధం. ఇందులో ముఖ్యమైనవి- బాంద్రా బండ్ స్టాండ్, మెరీన్‌డ్రయివ్, జుహూ, చౌపాతీలున్నాయి,
‘‘నోహార్న్’, ‘‘నో యుటర్న్’’ల లాగా ‘‘నో సెల్ఫీ జోన్స్’’ అంటూ బోర్డులు, పోలీసు నిఘా కూడా ఏర్పాటుచేశారు. 1200 రూపాయల జరిమానా పెట్టారు. మొన్న జనవరిలో ముగ్గురు అమ్మాయిలు తారున్నమ్ అన్సారీ (18), అంజుమ్ (19), రూస్తూరీవాసిమ్ (19) సముద్ర తీరాన వున్న ఒక పాత కోట మీదినుంచి సముద్రంలోకి పొడుచుకెళ్లిన ముక్కోణపు ప్రదేశం మీద నిలబడి సెల్ఫీలు ‘క్లిక్’ చేసుకునే తన్మయత్వంలో వెనక్కి తూలి, సముద్రంలో పడిపోయారు. అక్కడే వున్న స్థానికుడు- నరేష్ వాలుంజా అనే యువకుడు క్షణమైనా సంకోచించకుండా సంద్రంలోకి దూకి, వీళ్లని రక్షించబోయాడు. అందులో యిద్దర్ని మాత్రం ఒడ్డుకి చేర్చగలిగాడు. ఐతే మూడవ అమ్మాయిని కాపాడబోయి, తాను కూడా సముద్ర కెరటాల కింద మునిగిపోయాడు. కాగా, అతని భౌతికకాయం దొరికింది గానీ తరుణ్నమ్ అనే యువతి శవం కూడా గల్లంతైంది. ఇలాంటి కథలు నిత్యం వార్తల్లో దర్శనమిస్తున్న తరుణంలో నిషేధం విధించడం ధర్మం కాదా? ఐతే ముందా ‘‘సెల్ఫీ ప్రకటనల్ని’’ కూడా టి.వి.తెరల మీద నిషేధించాలి అంటున్నారెందరో. వాస్తవానికి ప్రపంచం మొత్తంమీద సెల్ఫీలు తీసుకుంటూ దుర్మరణం పాలయిన వారి సంఖ్య 2014 చివరికి 49, కాగా అందులో 19 మంది మన దేశస్తులే. ఈ పిచ్చి వ్యామోహానికి బలైపోయారు. ‘సెల్ఫీస్టిక్‌లను బ్యాన్ చెయ్యాలి’అన్న ఉద్యమం కూడా సన్నగా మొదలైంది.

‘‘రేపిస్ట్’’ లీడర్ ఆస్తుల జప్తు!
మైనర్ బాలికని రేప్ చేశాడన్న ఆరోపణ మోస్తూ, కనపడకుండా పోయిన ఆర్.జె.డి. నాయకుడు నవాడా శాసనసభ్యుడు, మాజీ కార్మిక మంత్రి అయిన రాజా బల్లభ్‌ని లొంగదీసుకోడం కోసం- నవాడాలోని అతని పార్టీ కార్యాలయం- నివాస గృహం రెండూ వున్న ‘‘బిల్డింగ్’’ని పోలీసులు జప్తుచేశారు. ఇదే భవనంలో ఒక మైనర్ బాలిక మీద ఫిబ్రవరి 6న అత్యచారం చేశాడన్నది కేసు.
రాజాబల్లభ్‌కి బలగం, అభిమానులూ గ్యాంగూ చాలామందే వున్నారు. అంచేత రుూ ఆస్తిజప్తుకోసం మొన్న ఆదివారం రెండువందల యాభై మంది పోలీసు బలగం అతని యింటి మీద పడ్డది. దారులన్నీ కట్టేశారు. రాజాబల్లభ్ లొంగిపోతే తప్ప రుూ జప్తుల పర్వం ఆపమని ప్రకటించారు- పాట్నా గయా, నలందా, నవాడాలో యితర ప్రాంతాలలోగల రుూ ఆర్.జె.డి. శాసనసభ్యుడి ఆస్తులు ఎన్నో వున్నాయి. వాటిని జప్తుచేస్తామంటూ పోలీసులు వార్నింగ్ యిచ్చారు. ఈ జప్తు కార్యక్రమానికి ఎనిమిది మంది డి.ఎస్.పి. హోదా అధికారులు నలందా, నవాడా పోలీస్‌స్టేషన్‌ల నుంచీ, వీరికి మద్దతుగా సి.ఆర్.పి.ఎఫ్; రాష్ట్ర రేపిడ్ యాక్షన్ బలగాలు కూడా దిగబడ్డాయి. కానీ చిత్రం ఏమిటీ అంటే- పోలీసులు ‘గోబ్యాక్’అంటూ రెండువందల మంది మహిళల బృందం పోలీసులని ఆ నివాసం ముందు అడ్డంపడ్డారు. ఇంతకీ, అసలు ఆరోపణ వైనం చూడగా అత్యాచారానికి గురిఅయిన, పదో తరగతి పరీక్షలు రాస్తున్న బాలిక ఆమెని చదువుకోడానికి ‘‘బీహార్ షరీఫ్’’లో ఒక యింట వుంచారు. తల్లిదండ్రులు ఆ ఇంటినుంచి, ఆ ప్రక్కన యింట్లో వుంటున్న సులేఖాదేవి, ఆమె కూతురు చోటీదేవినీ, ఆమె తల్లి రాధాదేవినీ కూడా పోలీసులు యిప్పుడు అరెస్ట్‌చేశారు. వీళ్లు ఫిబ్రవరి ఆరున, బాలికను మభ్యపెట్టి, యించుమించు బలవంతంగా - ‘‘పుట్టినరోజు వేడుకలు చూద్దువు’’గాని రా,’’ అని తీసుకుపోయి ఎమ్.ఎల్.ఏ. యింట దిగబెట్టారు’’అన్నది ఆరోపణ. అటు తరువాత బాధితురాలయిన రుూ బాలికని పోలీసులు బల్లభ్‌ప్రసాద్‌యాదవ్ యింటికి తీసుకుపోగా- అక్కడ, ఆమె ఇంట్లోనుంచి బయటకుపోతూవున్న ఎమ్.ఎల్.ఏ. రాజబల్లభ్‌ప్రసాద్‌ని చూస్తూనే- ‘‘అదో! ఆ అంకులే నామీద తప్పుడు పనిచేశాడు’’- అంటూ వేలెట్టి చూపించింది. ఆ అంకులే (ఎమ్.ఎల్.ఏ). ఈ బాలికని తెచ్చినందుకు సులేఖాదేవికి బాగానే సొమ్ములు- 30వేల రూపాయలు దాకా ముట్టజెప్పారుట. యాదవ్ (56)కి ముందస్తు బెయిలు దొరకలేదు. అంచేత మూడువారాలైంది. అదృశ్యమయినాడు ‘‘పదోతరగతి పరీక్షలు రాయించి పిల్లని దూరంగా తీసుకుపోతానయ్యా!’’ అంటూ బాలిక తండ్రి వాపోతున్నాడు. లల్లూప్రసాద్‌యాదవ్ ఈ రేపిస్ట్‌కి ప్రియతముడట. సాయం చేయలడా?.

జైలు జీవితమే హాయి?!

సినిమా తార సంజయ్‌దత్ యర్వాడా జైలులో సుఖంగానే దైనందిన కార్యక్రమాలు నడిపాడనీ పూజాభాంగోయివాలా అనే జర్నలిస్టు చెబుతోంది. అతని రూము 10’తి 8’ అయినా, దాని ఎదురుగా వెయ్యి చదరపుటడుగుల గార్డెన్ కూడా వుంది. అక్కడే పచార్లు చేసేవాడు. పుస్తకాలు చదవడం ఆనక జైలు రేడియోస్టేషన్‌లో ఖైదీలకోసం ప్రోగ్రాములు చేసి, ప్రసారం చెయ్యడం అతని నిత్యకృత్యాలు. తరువాత న్యూస్‌పేపర్ బ్యాగ్స్ చెయ్యడం అతని పని. ఓ వంద సంచులు చేస్తే నలభై అయిదు రూపాయలు యిచ్చేవారు. రేడియోలో తన సినీ డైలాగులు, పాటలు వగైరా ప్రెజెంట్ చేస్తూ- ఖైదీలను కూడా ‘‘్ఫ్యన్స్’’గా చేసుకున్నాడు రుూ ‘ఖల్‌నాయక్’. కాని అతని వెంట నలుగురు పోలీసులు సదా వుండేవారు. నిద్రపోతూ వుంటే మాత్రం ఒక్కడే తలుపు వేసుకుని నిద్రించేవాడు. ఈ జర్నలిస్టు పూజా ఇలాంటి జైలుజీవుల గాథలతో ఒక పుస్తకం అచ్చువెయ్యబోతుందట. సంజయ్ ఓ వంద కాపీలు తన నిర్మాతల చేత కొనిపించడా? అని.

గవర్నర్ హంతకుడికి ఉరి!

పాకిస్తాన్‌లో మతం దూషణ లేదా దైవదూషణ గొప్ప నేరం. ‘‘వెనకటికి ‘‘పాక్ పంజాబ్’’ గవర్నర్ సల్మాన్ వాసిద్ పాక్‌లోని మత దూషణా చట్టాన్ని మత ఛాందసాన్ని తరచూ విమర్శించేవాడు. వీటిని ‘ఎత్తేయాలి’ అనేవాడు. దీన్ని చూసి అతని అంగరక్షకుడు కమాండో ముంతాజ్ ఖాద్రీ మండిపోయేవాడు. అలాగే 2011లో ఒక మార్కెట్ దగ్గర పబ్లిక్‌గా ముంతాజ్ ఖాద్రీ తన యజమాని సల్మాన్‌ని ఆవేశంలో తుపాకీ తీసి కాల్చి చంపేశాడు. గొప్ప సంచలనంగా రుూ కేసు విచారణ సాగింది. చివరికి క్షమాబిక్ష దొరకలేదు. రావల్పిండిలోని అడియాలా జైలులో తెల్లారగట్ల నాలుగున్నరకి ఖాద్రీని ఉరితీసేశారు. చాలా ఇస్లామిస్టు సంఘాల దృష్టిలో దైవదూషణను సహించని అతను యిప్పటికీ ఒక ‘హీరో’ అంటారు! ప్రదర్శనలు ప్రొటెస్టులు మామూలే కదా!

-వీరాజీ