Others

ఫునశ్చరణే పాఠం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎస్సెస్‌మెంట్‌లో ఒక భాగం ప్రతిరోజూ పునశ్చరణ చే యడం. అది ప్రతిరోజూ లేదా వారానికి ఒకరోజు జరగవచ్చు. నెలకు ఒకసారి కూడా జరగవచ్చు. అది వౌఖికంగా కొన్నిసార్లు, కొన్ని సమయాల్లో రాతపూర్వకంగా వుంటుంది. పునశ్చరణ వౌఖికంగా జరిగినా టీచర్ దాన్ని రికార్డు చేసుకోవాల్సి వుంటుంది. రాతపూర్వకంగా జరిగితే ప్రతివాక్యం చదవాలి. ఈ పునశ్చరణ పద్ధతులే ఉపాధ్యాయులలో కొత్త భావాలకు మూలాధారం అవుతాయి. కరెక్టుగా రాసిన వారుంటారు. తప్పుగా రాసిన వారుంటారు. అదే మనలో కొత్త భావనలకు ప్రేరణ కల్పిస్తుంది. అదే ఉపాధ్యాయునిలో ప్రత్యామ్నాయ భావాలకు, పరిష్కార భావాలకు మూలమవుతుంది. మన దగ్గర ఒకే పరిష్కారం వుంటుంది. దానే్న ఆధారం చేసుకుని చూస్తూ వున్నాం. అదే సమస్యను వేరే దృక్కోణంలో చూడవచ్చునని అర్థమవుతుంది. గురువుకు గురువే విద్యార్థి. పిల్లలు తప్పు చేశారని కొట్టివేస్తాం. ఆ తప్పులే ప్రత్యామ్నాయ పరిష్కారానికి పునాది. ఆ విద్యార్థి తప్పుగా రాసేందుకు ఎందుకు ఆలోచించాడు? ఏ స్టెప్ దగ్గర తప్పు అడుగుపడింది? తప్పుగా ఆలోచించే అవకాశం ఎక్కడ వుంది? ఆ ఆలోచనలు పనిచేస్తే మనకు పరిష్కారం దొరుకుతుందా? దొరికినట్టయితే. అది ప్రత్యామ్నాయ పరిష్కారం అవుతుందా? కొలంబస్ తోవ తప్పాడు కాబట్టే కొత్త ఖండం ఆవిష్కరణ జరిగింది. కొత్త ఆవిష్కరణలన్నీ కూడా తప్పుల నుంచే వస్తాయి. పరీక్షను నిర్వహించిన దానికన్నా పిల్లలు రాసిన పత్రాలను శ్రద్ధగా చదవడమే ఉపాధ్యాయుని మొదటి పరీక్ష. ప్రతి ఎర్ర సిరా వెనక ఒక కాంతి కిరణం వున్నదని మరిచిపోవద్దు. సంబంధిత విద్యార్థితో ఒంటరిగా కూర్చుని మాట్లాడితే తన ఆలోచనలు విశదీకరించుకోవచ్చు.
తప్పుచేసే వాడిని చిన్న చూపుచూడడం కన్నా, అతనితో సమాలోచనలు చేస్తేనే మనం మరింత ‘ఎడ్యుకేట్’ అవుతాము. ఒక సమస్యకు ఒకే పరిష్కారం వుంటుందనే కాలాలు పోయాయి. ఉపాధ్యాయుడు తరగతి గదిలో పిల్లలతో కూర్చుని ఉన్నపుడు ఎన్నో పరిష్కారాలు నేర్చుకుంటాడు. ఓ విద్యార్థికి తక్కువ గ్రేడ్ ఇచ్చి ‘ఫెయిల్’ అనే ముద్ర వేసేకన్నా అతన్ని ప్రోత్సహించినపుడే విద్యార్థుల్లో, గురువుల్లో మార్పు వస్తుంది. తరగతి గదికి కేవలం సక్సెస్‌ఫుల్ విద్యార్థే మార్గదర్శి కాదు. ఫెయిల్ అయిన వారే గురువుకు స్ఫూర్తిగా వుంటారు. ప్రతిరోజూ పిల్లల నుంచి గురువులు సైతం ఎన్నో విషయాలను నేర్చుకుంటారు. పునశ్చరణ పిల్లలకు ఎంత అవసరమో ఉపాధ్యాయులకూ అంతే అవసరం.

-చుక్కా రామయ్య