Others

వెచ్చదనాల వింటర్ వేర్...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చలికాలం వచ్చిందంటే గుర్తుకువచ్చేవి, వెచ్చదనాన్నిచ్చేవి వింటర్‌వేరే! చలి నుంచి శరీర రక్షణకు నేడు కొత్త వెరైటీస్‌తో వింటర్ కలెక్షన్స్ మార్కెట్లో ప్రవేశిస్తున్నాయి. సీజనల్ ఫ్యాషన్లు అనుసరించడంలో ఎప్పుడూ ముందుండే నేటి తరం వింటర్ డ్రెస్సింగ్‌లోనూ సరికొత్త ఫ్యాషన్లకు తెరలేపింది. ముదురు రంగుల్లో జర్కిన్లు, వెరైటీ డిజైన్లతో కూడిన సరికొత్త వులెన్ దుస్తుల్లో కనువిందు చేస్తున్నారు. చలినుంచి కాపాడుకోవడంతోపాటు, ఈ సీజన్‌కు సరిపోయే వస్తధ్రారణ ఇదేనని వారు అభిప్రాయపడుతున్నారు.
కళాశాలలకు వెళ్ళే కుర్రకారు చల్లటి వాతావరణానికి అనువుగా, సౌకర్యవంతంగా ఉండే సీజనల్ కలర్‌ఫుల్ వస్తధ్రారణతో కనిపిస్తున్నారు. రోజురోజుకు వాతవారణం చల్లగా మారుతుండటంతో ఉదయం, రాత్రి వేళల్లో బయటకు వెళ్ళాలంటేనే జంకుతున్నారు. దీంతో చలి నుంచి తప్పించుకోవడానికి చాలామంది వింటర్ వేర్‌ను ఆశ్రయిస్తున్నారు. వారి అభిరుచులకు అనుగుణంగా అనేక మోడల్స్‌లో వింటర్ వేర్స్ లభ్యవౌతున్నాయి. ఇక బ్రాండెడ్ కంపెనీలు తయారుచేసే స్వెట్టర్లకు మంచి ఆదరణ వుంది. చలి నుంచి బయటపడేందుకు అందరూ ధరించే స్వెట్టర్లు సైతం ఫ్యాషనబుల్ కలర్స్‌లో, విభిన్న డిజైన్లలో లభిస్తున్నాయి. వీటిని మల్టిపుల్ కలర్స్‌లో, వెరైటీ మోడల్స్‌లో ఆకర్షణీయంగా రూపొందిస్తున్నారు.
జాకెట్స్, స్వెట్టర్లతోపాటు చేతులకు రక్షణగా గ్లౌస్స్ కూడా వివిధ వెరైటీల్లో దొరుకుతున్నాయి. వీటిని ఎక్కువగా టూవీలర్‌పై వెళ్ళేవాళ్లు ఇష్టపడుతున్నారు. లెదర్, ఇంపోర్టెడ్ జర్కిన్లు, టూవే కలర్స్, ఎంబ్రాయిడరీ వులెన్ స్వెట్టర్లతో కూడిన సరికొత్త వెరైటీలను ఎక్కువగా ఈ సీజన్లో కొనుగోలు చేస్తున్నారు.

- తరిగొప్పుల విఎల్లెన్ మూర్తి