Others

మంటల్లో భూగోళం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మానవాళి తప్పిదాలతో వాతావరణ మార్పులు ముమ్మరించి, భూతాపం గణనీయంగా పెరిగి ప్రకృతి వికృత రూపం దాల్చుతోంది. పారిశ్రామిక విప్లవానికి ముందు నాటికంటే రెండు డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతలు పెరగకుండా చూడాలని గత సంవత్సరం జరిగిన పారిస్ సదస్సులో ప్రపంచ దేశాలు ఏకగ్రీవంగా తీర్మానించాయి. ఆ తర్వాత మాంట్రియల్ ప్రొటోకాల్‌ను సవరిస్తూ ప్రమాదకర ‘హైడ్రోఫ్లోరోకార్బన్ల’ (హెచ్‌ఎఫ్‌సీ)ను నియంత్రించే ‘కిగాలీ’ ఒప్పందానికి 197 దేశాలు ముక్తకంఠంతో ఆమోదముద్ర వేశాయి. ప్రపంచ దేశాలను మూడు విభాగాలుగా విభజించి హెచ్‌ఎఫ్‌సీలను దశలవారీగా కట్టడి చేయాలన్న ఈ ఒప్పందం వాతావరణ ఉపద్రవాలపై మానవాళి సాగిస్తున్న పోరులో కీలక పాత్ర వహించనుంది. భూమండలం క్రమంగా వేడెక్కుతూ లక్షా 15 వేల సంవత్సరాల కంటే ముందుస్థాయికి చేరుతోందని, ఇప్పటి బొగ్గుపులుసు వాయువు(కార్బన్ డై యాక్సైడ్) గాఢత 30 లక్షల సంవత్సరాల క్రితం ఉన్నదానితో సమానమని అమెరికాలోని ‘నాసా’ శాస్తవ్రేత్తల అధ్యయనాలు ఘోషిస్తున్నాయి.
ప్రపంచ వ్యాప్తంగా ముంచుకొస్తున్న ఈ ముప్పును నివారించని పక్షంలో మరో నాలుగు దశాబ్దాల్లో భూమి నిప్పుల కుంపటిగా మారి, మరో నాలుగైదు సెంటీగ్రేడ్ డిగ్రీల ఉష్ణోగ్రత పెరిగి జీవరాశి మనుగడకే ప్రమాదం వాటిల్లబోతుందని నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. భూతాపం మూడు డిగ్రీల మేరకు అధికమైతే- సముద్ర మట్టాలు మరింతగా పెరిగి తుపానులు, సునామీలు, భయంకరమైన అతివృష్టి, అనావృష్టితో ఆహార కొరత వెంటాడుతుంది. ఈ భూతాప దుర్భర పరిస్థితులు ఏ ఒక్క దేశానికో కాకుండా సమస్తవిశ్వానికి వర్తిస్తాయని, దీన్ని నివారించేందుకు ప్రపంచ దేశాలన్నీ నడుంకట్టి ఏ చిన్న అవకాశాన్ని కూడా వదలుకోరాదన్న సంకల్పం తాజా ఒప్పందంలో ప్రస్ఫుటమవుతోంది. ఒప్పందాన్ని నిక్కచ్చిగా అమలు జరిపినట్లయితే, వచ్చే శతాబ్దంలో ఒక ఫారెన్ హీట్ డిగ్రీ ఉష్ణోగ్రతను తగ్గించే వీలుంటుందని శాస్తవ్రేత్తలు అంటున్నారు. ఒప్పందం మేరకు అమెరికా, ఐరోపా లాంటి అభివృద్ధి చెందిన దేశాలు 2036 నాటికి 85 శాతం హెచ్‌ఎఫ్‌సీలను తగ్గించాల్సి ఉంటుంది. చైనా 2045 నాటికి 80శాతం, 2047 నాటికి భారత్ 85 శాతం హెచ్‌ఎఫ్‌సీలను తగ్గించే చర్యల్ని చేపట్టాల్సి ఉంది. లోకకల్యాణం కోసం, శాంతి సౌఖ్యాల కోసం నిరంతరం తపించే భారత్ మెరుగైన ప్రత్యామ్నాయ శాస్ర్తియ పరిశోధనల్ని ముమ్మరం చేయాల్సిన అవసరం ఉంది. ‘కిగాలీ’ ఒ ప్పందం యథాతథంగా అమలైతే 2020-50 మధ్యకాలంలో దా దాపు 7,000 కోట్ల టన్నుల కర్బన ఉద్గారాల దుష్టప్రభావాన్ని ప్రపంచ దేశాలు మూ కుమ్మడిగా నివారించే వీలుంటుంది. నిజానికి అమెరికా, చైనా దేశాలతో పోల్చితే ఇండియాలో కర్బన ఉద్గారాలు తక్కువనే చెప్పాలి. ప్రపంచ హెచ్‌ఎఫ్‌సీ వాటాలో పాతిక శాతం వాటా అమెరికాదే. చైనా 59 శాతం హెచ్‌ఎఫ్‌సిలను ఉత్పత్తి చేస్తూ 23 శాతం వాడుకొంటోంది. ఇండియా ఉత్పత్తిచేస్తున్నది 2.32 శాతం, వినియోగం చేస్తున్నది 1.6 శాతం. వాతావరణ మార్పుల ఫలితంగా ఏర్పడే సంక్షోభాలను పరిష్కరించేందుకు వర్ధమాన, పేద దేశాలకు 2020 నుంచి ఏటా 10వేల కోట్ల డాలర్లను అభివృద్ధి చెందిన దేశాలు సమకూర్చాలంటున్న పారిస్ ఒప్పందం కాస్తా అటకెక్కింది. చట్టబద్ధమైన ‘కిగాలీ’ ఒప్పందానుసారం వర్ధమాన ప్రపంచానికి అవసరమైన ఆర్థిక తోడ్పాటును అందించడానికి అగ్ర రాజ్యాలు సమ్మతించడం హర్షదాయకం. హెచ్‌ఎఫ్‌సీ ప్రత్యామ్నాయాల ఖరీదును ఇష్టారాజ్యంగా పెంచి, తమ సాయాన్ని ఇంతలింతలుగా చాటుకొనే బూటకపుప్రకటనలపై ఐక్యరాజ్య సమితి యంత్రాంగం పర్యవేక్షణ చేయాలి. అపుడే ఆశించిన రీతిలో ఫలితాలు అందుబాటులోకి వ స్తాయి.
సమస్త జీవరాశికి ఆధారభూతమైన భూమిపై పా రిశ్రామిక దేశాలు స్వార్థపూరిత విధానాలతో భూతాపాన్ని పెంచే ప్రక్రియలను మానుకొని ‘మనకున్నది ఒక్కటే భూమి’ అన్న ప్రాప్తకాలజ్ఞతతో వ్యవహరించాలి. పారిశ్రామికంగా ముందంజలో ఉన్న దేశాలు భూతాపాన్ని తగ్గించేలా కృషి చేస్తేనే ప్రపంచ వ్యాప్తంగా వాతావరణం చల్లబడుతుంది. ఆరు రుతువుల ప్రకృతి మానవాళికి ఆహ్లాదాన్ని పంచే వీలుంటుంది.

- దాసరి కృష్ణారెడ్డి