Others

నాకు నచ్చిన పాట--నరవరా.. ఓ కురువరా..బంగారు ప్రాయమిది..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాంతారావు, దేవిక, రేలంగి, విజయనిర్మల నటీనటులుగా 1967లో వచ్చిన ‘పిన్ని’ చిత్రంలో ఆరుద్ర రాసిన ఓ పాట ఆలోచనాత్మకంగా వుంటుంది. టివి రాజు స్వరపరచిన ఈ పాటను సుశీల అద్భుతంగా గానం చేశారు. పాట ప్రారంభంలోనే విజయనిర్మలతో పిన్ని వరస అయిన దేవిక మాట్లాడుతూ ఆడదై పుట్టిన తర్వాత పడే పాట్లు, అనుభవాలు గుర్తు చేసుకుంటూ జోలపాట పాడుతుంది. స్ర్తికి కంటినిండా కునుకు వచ్చేది రెండేసార్లని, మొదటిది బాల్య దశలోనే, రెండవది మరణంలోనూ అంటూ ఆరుద్ర అద్భుతంగా చెప్పిన తీరును వినవచ్చు. చిన్నతనమే బంగారుప్రాయమని, ఏ చీకూ చింతా లేకుండా నిదురపోగలిగిన వయసని, అందుకే ఇప్పుడే బాగా నిద్రపోవాలని చెప్పడం ఈ పాటలో ఆకట్టుకుంటుంది. ఐదేళ్ల వయసు దాటితే బడిలో చదువుతో పోరాటం. ఈడు రాగానే తోడు కావాలనే చరణం వచ్చినప్పుడు విజయనిర్మలను, సింబాలిక్‌గా బొమ్మను చూపడం పాటకు మరింత వనె్న తెచ్చింది. కోరి వలచినవాడు చేరబోయినతో తండ్రి కాదంటే నిదురెక్కడుంది? వివాహం కాగానే స్ర్తికి సంసారం, పిల్లలు అంటూ విరామం ఉండదని, ఆవలిస్తే నిదురవచ్చినా పడుకోటానికి తగిన సమయం ఉండదని పాట చెబుతుంది. తన బాధ్యతలతోపాటు నేటి స్ర్తి అటు ఉద్యోగిగా, గృహిణిగా ఎన్నో బాధ్యతలను నెత్తికెత్తుకుంది. కుటుంబాన్ని తీర్చిదిద్దుతున్న తీరు చూస్తే ఈ పాట నేటికీ సజీవంగానే వుందనే చెప్పాలి. తొలిసారి, కడసారి తల్లి, మళ్లి, ఆడుకోవాలి -పాడుకోవాలి వంటి అంత్యప్రాసలు ఆరుద్ర సొంతం. ఈ పాట అందరికీ నచ్చిన గీతం.

-ఎస్‌ఎస్ శాస్ర్తీ, విశాఖపట్నం