Others

నాకు నచ్చిన చిత్రం--పల్లెటూరి పిల్ల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిఎ సుబ్బారావు శోభనాచలవారు సంయుక్తంగా 1950లో చిత్రీకరించిన పల్లెటూరి పిల్ల ఇప్పటికీ, ఎప్పటికీ గొప్ప చిత్రమే. పల్లెల గొప్పదనాన్ని ఆనాడే అద్భుతంగా తెరపై ఆవిష్కరించిన ఈ చిత్రం ప్రారంభంనుండి ఉత్కంఠ భరితంగా సాగుతుంది. శాంతవంటి పిల్ల లేదోయి అని ఘంటసాలవారి గానం అద్భుతంగా వుంది. ఎన్టీఆర్ జయంతుడిగా, ఎఎన్‌ఆర్ వసంతుడిగా, అంజలీదేవి శాంతగా అద్భుతంగా నటించారు. వీరితోపాటుగా కంపన్నదొరగా ఎవి సుబ్బారావు నటన ఈ చిత్రానికి హైలెట్. కనకం, సురభి బాలసరస్వతి, సీత, సీతారామ్‌ల సపోర్టింగ్ నటన మరువరానిది. అన్నిటికన్నా ముఖ్యమైనది తాతగా ఎస్వీ రంగారావు పాత్రను ఉదాత్తంగా తీర్చిదిద్దిన విధానం అద్భుతం. కంపన్న దొర ఊళ్లమీద పడి దోచుకుంటుంటాడు. జయంతుడు కంపన్నదొర శిష్యరికంలో పెరిగి అతనికన్నా కర్క్ఠోకుడిగా మారి, ప్రజలను నానా బాధలు పెడుతుంటాడు. ఉదాత్తమైన వ్యక్తిత్వం కల శాంత చెంపదెబ్బతో మారిపోతాడు. అప్పటినుండి దొంగతనాలు మాని, పల్లెటూరు చేరుకొని, జీవితాన్ని తీర్చిదిద్దుకుంటాడు. అతని మనసు తెలుసుకున్న శాంత తన బావ వసంత్‌ను కాదనుకొని పెళ్లి చేసుకుంటుంది. ఇది తెలుసుకున్న కంపన్న దొర జయంతుడిపై పగ తీర్చుకునే ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. ఊరి ప్రజలు అందరూ కలసి కంపన్నదొర అనుచరులను తరిమి కొడతారు. కొండమీద అమ్మవారి కొలుపులు జరుగుతుంటే, దొంగచాటుగా వచ్చిన కంపన్నదొర బృందం జయంతుణ్ణి బందీ చేసి తీసుకెళతారు. వసంతుడు సాహసంతో కంపన్నదొర గుహకువెళ్లి వీరోచితంగా మాట్లాడి జయంతుణ్ణి విడిపించే ప్రయత్నం చేస్తాడు. చివరికి ఈ కథనంలో వసంతుడు ఆత్మబలిదానంతో సినిమా ముగుస్తుంది. చిన్న కథే అయినా దాదాపు మూడు గంటలపాటు ఈ చిత్రాన్ని దర్శకుడు బిఎ సుబ్బారావు ప్రతి సన్నివేశంలో ప్రత్యేకత ఉండేలా చిత్రీకరించారు. పల్లెటూరి పిల్ల శాంతగా అంజలిదేవి అమోఘమైన నటన ఈ చిత్రంలో చూడవచ్చు. దేశ సంపదకు పల్లెలే ఆయువుపట్లని, పల్లెలు కళకళలాడుతున్ననాడు ప్రపంచం నిత్యకళ్యాణంతో విలసిల్లుతుందని ఈ చిత్రంలో చక్కగా చెప్పారు. నేడు ప్రజలందరూ పట్టణాలవైపు పారిపోతుంటే, ఒక్కసారి ఈ సినిమాను చూపిస్తే చాలు. పల్లెల గొప్పదనాన్ని తెలుసుకుంటారు. సినిమా సాధించే ప్రయోజనాల్లో ఇది కూడా ఒకటి. ప్రేక్షకులలో ఆలోచన రేకెత్తించి, పల్లెలే దేశానికి పట్టుగొమ్మలు అని ఈ చిత్రం నిరూపిస్తుంది. అందుకే ఈ చిత్రం అంటే చాలా ఇష్టం.

-టి రఘురామ్, నరసరావుపేట