Others

ప్రేక్షకులకు ట్రెండ్ ఉండదు (డైరెక్టర్స్ చాయిస్..)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

-రవీంద్ర సూరి

ఒక జోనర్‌లో సీక్వెన్స్ సినిమాలు వచ్చినపుడు ‘ట్రెండ్’ అనుకోవడమే తప్ప, ప్రేక్షకుల దృష్టిలో ప్రత్యేకమైన ట్రెండ్ అంటూ ఏమీ ఉండదంటున్నాడు కొత్త దర్శకుడు రవీంద్ర సూరి. లఘు
చిత్రాలతో కెరీర్ మొదలుపెట్టి
‘చెంబు చిన సత్యం’ సినిమాతో
పరిశ్రమలో మెయిన్‌స్ట్రీం దర్శకుడిగా గుర్తింపు పొందిన సూరితో
ఈ వారం చిట్‌చాట్

మీ నేపథ్యం?
సూర్యాపేట జిల్లాలోని శిల్పకుంట్ల మా ఊరు. తెలుగులో ఎంఫిల్ చేశాక, సినిమాపై ఆసక్తితో ఎల్‌బి శ్రీరాం వద్ద రైటర్‌గా కొన్నాళ్లు పనిచేశా.
మరి దర్శకుడిగా..?
డైరెక్షన్ పిచ్చి బాల్యం నుంచే ఉంది. ఏ సన్నివేశాన్నైనా అర్థవంతంగా చూపించాలన్న విజన్ ఉండేది. చిరంజీవి సినిమాలు చూసినప్పుడు కోరిక బలపడింది. డిపార్ట్‌మెంట్‌లో ఎవరి దగ్గరా పని చేయలేదు. స్ట్రగులే నన్ను డైరెక్టర్‌ని చేసింది.
నచ్చిన జోనర్?
లవ్, యాక్షన్ జోనర్లు ఇష్టం. నచ్చిందే తీస్తానంటే ప్రేక్షకులు చూడరు. వాళ్లకు నచ్చింది మనకొచ్చినట్టుగా చిత్రీకరిస్తే ఆడియన్స్ కనెక్టవుతారు. అప్‌డేట్‌తోనే డైరెక్టర్‌గా నిలబడతాం.
పరిశ్రమలో లేటెస్ట్ ట్రెండ్?
ట్రెండంటూ ఉండదు. ఏ జోనర్ సినిమామైనా రెండు గంటలు మెప్పించేలా తీస్తే చూస్తారు. దర్శకులు, రచయితలు లవ్, హారర్‌పై దృష్టిపెట్టడంతో ఆ తరహా సినిమాలు వస్తున్నాయంతే. అదే ట్రెండ్ అనుకుంటాం.
తొలి అవకాశం?
షార్ట్ ఫిల్మ్స్ తీసిన ఆలూరి సాంబశివరావు నుంచి ఫస్ట్ చాన్స్ వచ్చింది. అన్నయ్య సురేందర్ ప్రోత్సాహం తోడైంది. అందుకే ఆయన గుర్తుగా పేరులో సూరి పెట్టుకున్నా.
ఇండస్ట్రీలో సమస్యలు?
చిన్న బడ్జెట్ చిత్రం కనుక ప్లాన్డ్‌గానే చేశా. కానీ, విడుదల టైంలో డిస్ట్రిబ్యూటర్లు చుక్కలు చూపించారు. పోస్టర్లు వేయడానికి కూడా ముందుకు రాలేదు. చిన్న సినిమా చేసి, పెద్ద ఇబ్బందులు ఎదుర్కొన్నా.
తరువాతి ప్రాజెక్టులు?
మూడు కథలు రెడీగా ఉన్నాయి. వాటిపై నమ్మకంతో ఉన్నా.
దర్శకుడంటే?
24 క్రాఫ్ట్స్‌కు విజనున్న కమాండర్.

-శేఖర్