Others

ఆమె ఆటే మాట!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనుకున్నది సాధించాలంటే అంగవైకల్యం అడ్డురాదని నిరూపించింది శ్రద్ధా వైష్ణవ్. పుట్టుకతోనే మూగ, చెముడు. అయితే ఆమె ఎప్పుడూ తనకు వున్న వైకల్యం గురించి బాధపడలేదు. తనకు ఇష్టమైన క్రికెట్ ఆడటం ప్రారంభించింది. సైగలనే మాటగా మలచి బౌలర్‌గా రాణిస్తున్నారు. నేడు ఈ 18 ఏళ్ల శ్రద్ధ చత్తీస్‌గఢ్ మహిళా క్రికెట్ జట్టు సభ్యురాలిగా ఎంపిక అయ్యా రు. దేశంలోని దివ్యాంగు (బధిరు)లందరికీ రోల్ మోడల్‌గా నిలిచింది.

చత్తీస్‌గఢ్‌లోని బిలాస్‌పూర్‌కు చెందిన రమేష్ వైష్ణవ్, కిరణ్‌లు తల్లిదండ్రులు. సోదరుడు ప్రతిరోజు క్రికెట్ కోచింగ్‌కు వెళ్ళేవాడు. అతనితో పాటు శ్రద్ధా కూడా స్టేడియంకు వెళ్ళేది. క్రమ క్రమంగా ఆమెలో క్రికెట్ నేర్చుకోవాలనే కోరిక పుట్టింది. 13 సంవత్సరాల వయసులో క్రికెట్ ఆడటం ప్రారంభించింది. క్రికెట్ పట్ల తన కుమార్తె చూపుతున్న ఆసక్తిని గమనించిన రమేష్ వైష్ణవ్ క్రికెట్ కోచ్‌తో మాట్లాడి, శిక్షణ ఇప్పించడం ప్రారంభించారు. తొలుత ఆమె మీడియం పేస్ బౌలర్‌గా ప్రాక్టీసు ప్రారంభించి నేడు స్పిన్నర్‌గా మారారు. ఆమె తన బౌలింగ్ ద్వారా లెగ్‌బ్రేక్‌లు వేసి బ్యాట్స్‌మెన్‌ను తికమకపెట్టడంలో అత్యంత నేర్పరి. రాష్ట్ర స్థాయి క్రికెట్ జట్టులో స్థానం సంపాదించిన తొలి దివ్యాంగ (బధిర- చెవిటి, మూగ) మహిళగా శ్రద్ధా వైష్ణవ్ రికార్డు సృష్టించారు. 1970లో రంజన్ భట్టాచార్య అనే బధిర యువకుడు ఫాస్ట్‌బౌలర్‌గా పలు దేశవాళీ మ్యాచ్‌లు ఆడాడు.
పుట్టుకతో వచ్చిన వైకల్యాలను అధిగమించి, రాష్ట్ర స్థాయి మహిళా క్రికెట్ జట్టుకు ఎంపికయ్యారు. శ్రద్ధా మ్యాచ్ జరిగే సమయంలో సైగల ద్వారా తన తోటి క్రీడాకారిణులకు సూచనలు ఇస్తుంది. దేశంలోని దివ్యాంగు (బధిరు)లందరికీ రోల్ మోడల్‌గా నిలిచిన శ్రద్ధా వైష్ణవ్ భవిష్యత్‌లో క్రికెట్‌లో మరిన్ని అద్భుతాలు సృష్టించాలని ఆశిద్దాం.

- పి.హైమావతి