Others

నాకు నచ్చిన పాట--రాయినైనా కాకపోతిని...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దైవకార్యానికి, దైవ దర్శనానికి, దైవ కృపకు భక్తుడు ఎంతగా తపించి, విలపించిపోతాడో ఎన్నో సినిమాల్లో చూపించారు. చిన్న చిన్న సేవలు చేసినంత మాత్రానే ఎంతోమందిని కరుణించిన కరుణామయుని దయ తనపైనా పడాలని, తానుకూడా ఆ తానులో ఓ చిన్న ముక్క కాలేకపోయానేనని ఓ భక్తురాలు ఈ కలియుగంలో పడిన ఆవేదనను ‘గోరంతదీపం’ చిత్రంలో ఆవిష్కరించారు. 1978లో బాపుగారి దర్శకత్వంలో నిర్మింపబడిన ఈ చిత్రంలో ఎన్నో మంచి పాటలున్నాయి. ఈ చిత్రంలో వాణిశ్రీపై చిత్రీకరించిన ఆరుద్ర గీతం గురించి ఎంత చెప్పినా తక్కువే. ఎన్నిసార్లు విన్నా తనివి తీరదు. ‘రాయినైనా కాకపోతిని రామపాదము సోకగా/ బోయనైనా కాకపోతిని పుణ్యకావ్యము రాయగా/ పడవనైనా కాకపోతిని స్వామి కార్యము తీర్చగా/ పాదుకైనా కాకపోతిని భక్తిరాజ్యములేలగా’ అంటూ వినిపించే ఈ గీతం ఆరుద్ర రచించిన గీతాల్లో ఒక మణిపూస. గడ్డిపోచగానైనా కాకపోతినే అంటూ బాధపడుతూనే, కేవలం మనిషిగా జన్మించి మత్సరముల బారినపడ్డానని తీవ్రంగా చింతిస్తుంది ఆ భక్తురాలు. భావగర్భితమైన పల్లవితో భక్తులను ఉత్తేజపరచే పాటగా ఆరుద్ర మలిస్తే -దానికి జనరంజకమైన బాణీనిచ్చి మరింత ఎత్తుకు తీసుకెళ్లారు సంగీత మామ కెవి మహదేవన్. వీరిద్దరి కృషి వృధాపోకుండా -తన కుంచెలోని అందాల సారాన్ని రంగరించి ఆ పాట సన్నివేశాన్ని ఓ మహా కళాఖండంగా మలిచి అందించారు దర్శకుడు బాపు. అజరామరమైన ఈ పాటను ఇష్టపడని వారుండరంటే అతిశయోక్తి కాదు.

-ఎన్ రామలక్ష్మి, సికిందరాబాద్