Others

అతీతంగా ఆలోచించాలి (డైరెక్టర్స్ చాయిస్..)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

-బందూక్ లక్ష్మణ్
తొలి చిత్రంతోనే వైవిధ్యమైన చిత్రం చేసి అందర్నీ ఆలోచింపజేసాడు లక్ష్మణ్. అప్పటినుండి ‘బందూక్ లక్ష్మణ్’గానే అతన్ని వ్యవహరిస్తున్నారు. సమాజంలోని బర్నింగ్ టాపిక్ ఇతివృత్తంగా మలచుకుని సినిమా చేసిన ఆయనతో
ఈవారం చిట్‌చాట్.
నేపథ్యం?
రంగారెడ్డి జిల్లా మంచాల మా ఊరు. డిగ్రీ వరకు చదువుకున్నా.
దర్శకుడిగా..?
వర్మ ‘శివ’తో నటుడవ్వాలనుకున్నా. స్వతహాగా డాన్సర్‌ని. మొదటిలో చిన్న చిన్న చిత్రాలు తీసేవాణ్ణి. తర్వాత దర్శకుడిగా మారా. అంతం, జగదేకవీరుడు- అతిలోక సుందరి చిత్రాలు నాకు గొప్ప ప్రేరణ.
నచ్చే జోనర్?
మొత్తంగా సినిమా అంటేనే ఇష్టం. ఏ జోనర్‌నైనా పరిపూర్ణంగా తీస్తే ఎవరికైనా నచ్చుతుంది. చాలామంది హరర్ జోనర్‌లో సినిమా ఈజీ అనుకుంటారు. అదే కష్టం. అందుకే ఆ జోనర్‌లో సినిమాలు తక్కువగా విజయం సాధిస్తాయి.
మరి ఇప్పుడంతా లవ్, హారర్‌లేగా?
కొద్దిరోజుల క్రితం వరకూ ఆ పరిస్థితి ఉంది. హారర్ సినిమాలు ఇప్పుడు తగ్గాయి. ఇప్పుడున్న ట్రెండ్‌లో హీరోను విలన్‌గా చూడటానికి ప్రేక్షకులు ఇష్టపడుతున్నారు. హీరోయిన్ ఐటమ్ చేసినా చూస్తున్నారు.
తొలి అవకాశం?
సంగీత దర్శకుడు చక్రి, లక్ష్మీగణపతి, సుబ్రహ్మణ్యం, 5 కలర్స్ మల్టీమీడియా శ్రీనివాస్ నా శ్రేయోభిలాషులు. వారి సలహాతోనే నేనే అవకాశం క్రియేట్ చేసుకున్నా. నేను ఎవరి చుట్టూ తిరగలేదు.
ఇండస్ట్రీ సమస్యలు?
15 సినిమాలు విడుదల చేసిన అనుభవం ఉంది. నా చిత్రాన్ని సెన్సార్ అయిన మరుసటిరోజే విడుదల చేశా. ముందుగానే ప్లాను పర్‌ఫెక్ట్‌గా వేసుకుంటా.
తరువాతి చిత్రాలు?
70, 80 దశకాల్లో జరిగిన ఓ లవ్ స్టోరీ సిద్ధం చేసా. ఈ చిత్రం 90 శాతం లండన్‌లో, 10 శాతం ఇండియాలో ఉంటుంది.
దర్శకుడంటే?
మంచి ఆలోచనను మధురంగా ఊహించి కొత్తగా చెప్పేవాడు. ఒకింత అతీతంగా ఆలోచించగలవాడు.

-శేఖర్