Others

తమ్మూ బెంగ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అప్‌కమింగ్ హీరోయిన్లు పెర్ఫార్మెన్స్‌తో అదరగొట్టేస్తుంటే -తమన్నా బాటియాలో తడబాటు మొదలైందట. టాప్ హీరోయిన్ల క్యాటగిరీలో నయనతార రూటు మార్చి చిన్న హీరోలతో పెద్ద సినిమాలు చేస్తోంది. పెద్ద హీరోలకు కాల్షీట్లే ఇవ్వడం మానేసింది. ఇక పెళ్లికి సిద్ధమవుతున్న సమంత క్రమంగా సినిమాలు తగ్గిస్తోంది. త్రిష దాదాపుగా రేసునుంచి పూర్తిగా పక్కకెళ్లిపోయింది. తరువాత టాప్ ప్లేస్ తనదేనని కలలుగన్న తమ్మూ బేబీకి -రకుల్, రాశి, రెజీనాలాంటి హీరోయిన్లు చెక్ పెట్టే పరిస్థితి కనిపిస్తోంది. ఇటీవలే డాన్సర్ ప్రభుదేవాతో చేసిన హారర్ థ్రిల్లర్ ‘అభినేత్రి’పై ఆశలు పెంచుకున్న తమ్మూకి కాలం కలిసిరాలేదు. దీంతో విశాల్‌తో జతకట్టి తమిళ, తెలుగు భాషల్లో విడుదలకు సిద్ధమైన ‘ఒక్కడొచ్చాడు’పై హిట్టు లెక్కలేసుకుంటోందట. ఈ సినిమాలో యాక్షన్ ఎపిసోడ్స్‌తోపాటు, ఉన్న అందాలను విరివిగా చూపించేందుకూ చాలా కష్టపడిందని అంటున్నారు. టీజర్ విడుదలతో విశాల్ స్టామినాపై అంచనాలు పెరగడంతో, హిట్టుపడితే తనకూ మరిన్ని ప్రాజెక్టులు దొరికే చాన్స్ ఉంటుందని ఆశపడుతోందట తమ్మూ బేబీ. తమిళంలో రెండు మూడు ప్రాజెక్టులు చేతిలో ఉండి, బిగ్ మూవీ ‘బాహుబలి కంన్‌క్లూజన్’లోనూ కనిపించబోతున్న తమన్నాకు -తరువాతేంటి? అన్న బెంగ మాత్రం తగ్గడం లేదట.