Others

స్తంభించిన టాలీవుడ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సూపర్ హిట్టు యాక్షన్ సినిమా ప్రీ క్లైమాక్స్‌లో -విలన్ దెబ్బకు గింగిరాలు తిరిగే హీరోలా టాలీవుడ్ విలవిల్లాడుతోంది. నల్లధనంపై ప్రధాని నరేంద్ర మోదీ యాక్షన్ ఎపిసోడ్ మొదలై వారం కావొస్తున్నా -‘పెద్ద’ దెబ్బనుంచి పరిశ్రమ తేరుకునే సీన్ కనిపించటం లేదు. ఇప్పట్లో తేరుకోవటం కష్టమన్న వాదనా వినిపిస్తోంది. పరిశ్రమలో ఉన్నదంతా నల్లధనమేనని డిజిటల్ కెమెరా ముందు చెప్పలేకున్నా -చాలావరకూ చలామణీ అయ్యేదంతా ‘బ్లాకే’నన్నది టాలీవుడ్‌లో ఓపెన్ స్క్రీన్‌ప్లే. ఈ పరిస్థితిలో -దేశంలోని నల్లధనాన్ని నియంత్రించేందుకు ఉరుముల్లేకుండా మోదీ కురిపించిన పిడుగుకు టాలీవుడ్డే కాదు, భారత సినీ పరిశ్రమ మొత్తం మూటా ముల్లు సర్దుకున్నట్టే కనిపిస్తోంది. నిన్నటి వరకూ కలర్‌ఫుల్ డిజిటల్ టింట్‌తో బహిరంగంగానే సాగిన కోట్ల రూపాయల ఎంటర్‌టైన్‌మెంట్ బిజినెస్ ఒక్కసారిగా స్తంభించింది. నిత్యం షూటింగులు, స్టార్ గ్లామర్‌తో కళకళలాడే టాలీవుడ్‌ను నిశ్శబ్ద వాతావరణమే ఆవరించింది. ఇప్పుడెక్కడా కోట్ల రూపాయల షూటింగులు, లక్షలతో వేసే సెట్టింగులు లేవు. బడ్జెట్‌లో థర్టీ, ఫార్టీ రెమ్యునరేషన్లు, షేర్ల ఊసు లేదు. విడుదలకు సిద్ధమైన సినిమాలకు సంబంధించి లక్షలతో ముందస్తు ప్రచారంగా సాగించే ‘ఆడియో ఫంక్షన్ల’ హడావుడి లేదు. షూటింగులు పూర్తి చేసుకున్న సినిమాల పోస్ట్ ప్రొడక్షన్లూ నిలిచిపోయాయి. విచిత్రం ఏంటంటే ‘పెద్ద నోటు రద్దు’ దెబ్బకు విడుదల కావాల్సిన సినిమాలూ వెనక్కిపోతున్నాయి. చిల్లర కోసం జనం సైతం అల్లాడుతుండటంతో -్థయేటర్లవైపు కనె్నత్తి చూసే ఆడియన్స్ లేరు. దీంతో చాలా సినిమాల విడుదల తేదీలు మారిపోయాయి. కాలం కలిసొస్తే సినిమా చేద్దాంలే అన్న ఆలోచనతో సాగుతోన్న ప్రీ ప్రొడక్షన్ పనులో, విపత్కర పరిస్థితిని ఎదుర్కొని విడుదలకు సిద్ధమవుతున్న స్టార్ హీరోల పర భాషా చిత్రాల హడావిడో తప్ప, టాలీవుడ్‌లో మరేం చప్పుళ్లు లేవని పరిశ్రమ వర్గాలే అంటున్నాయి. కోట్ల రూపాయలతో వ్యాపారం సాగించే పెద్దవాళ్ల కష్టాల మాటెలావున్నా -పరిశ్రమ నీడన హాయిగా బతికేస్తున్న వేలాది కుటుంబాల ఇబ్బందులు వర్ణణాతీతమన్న వేదన వ్యక్తమవుతోంది. ట్వెంటీ ఫోర్ క్రాఫ్ట్స్‌లో రోజువారీ బత్తాలపై బతికే అనేకమంది వర్కర్ల కుటుంబాలు -నోటు దెబ్బకు నోటిమాట లేకుండాపోయారు. మరోపక్క దేశంలోని నల్లధనంపై మొదలైన యుద్ధంలో ఇది శాంపిల్ మాత్రమేనని, భవిష్యత్ నిర్ణయాలు మరింత కఠినంగా ఉంటాయంటూ నరేంద్ర మోదీ చేస్తున్న హెచ్చరికలు -పరిశ్రమ పెద్దల కంటిపై కనుకులేకుండా చేస్తున్నాయి. పైకి గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నా -పరిశ్రమకు ఇది పెద్ద దెబ్బేనన్న భావన స్పష్టంగా కనిపిస్తోంది. బినామీలపైనా, బ్యాంకు లాకర్లపైనా మోదీ దృష్టి కేంద్రీకరిస్తున్నారన్న కథనాలూ -పరిశ్రమలో తీవ్ర కలకలానే్న రేపుతోంది. వారంక్రితం వరకూ -్భరీ సినిమాలు, భారీ కలెక్షన్లు, వంద కోట్ల క్లబ్‌ల లెక్కలతో కొత్త కరెన్సీ నోటులా ఫెళఫెళలాడిన టాలీవుడ్ -ఇప్పుడు రద్దయిన పెద్ద నోటులా దీనంగా కనిపిస్తోంది. క్యాష్‌ను క్యారీ చేసుకునే ప్రయత్నాల్లో ఫిల్మ్ ఫైనాన్షియర్లు, స్టార్ హీరోలు, బిగ్‌షాట్ డిస్ట్రిబ్యూటర్లు నిమగ్నమైవుంటే -షూటింగులు నిలిచిపోయి, ఎప్పుడు మొదలవుతాయో అర్థంకాక వర్కర్లు గగ్గోలు పెడుతున్నారు. ప్రధాని మోదీ ఇచ్చిన షాక్‌కు -ఇప్పట్లో టాలీవుడ్‌కు పెద్దమొత్తంలో పెట్టుబడులు వచ్చే పరిస్థితి లేదు. ఫస్ట్ డే రికార్డులు, బాక్సాఫీస్ గలగలలు, ఓవర్సీస్ కలెక్షన్లలాంటి పడిగట్టు పదాలు వినిపించే చానే్స లేదు. ఇప్పుడు అక్కడ కనిపిస్తున్నది -్భవిష్యత్ బొమ్మ ఎంత భయంకరంగా ఉండబోతుందన్న దిగులు ఒక్కటే.