Others

డైరెక్షన్ చేస్తా..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అజంతా శిల్ప సౌందర్య వొంపుసొంపులతో ఆకట్టుకునే అను ఇమ్మాన్యుయేల్ దృష్టి ఇప్పుడు డైరెక్షన్ మీద పడిందట. ఇటీవలే నానితో ‘మజ్ను’లో జోడీకట్టి యూత్ హృదయాలను కొల్లగొట్టిన ఈ భామ -త్వరలో విడుదల కానున్న
‘ఆక్సిజన్’ చిత్రంలో గోపీచంద్ సరసనా కనిపించబోతోంది. ఇటీవలే ఓ చానెల్‌కు ఇంటర్వ్యూ ఇస్తూ -డైరెక్షన్
డిపార్ట్‌మంట్‌కు రావాలన్న ఉత్సుకత అయితే ఉంది. కాకపోతే -అదెప్పుడో మాత్రం ఇప్పుడే చెప్పలేను అంటూ మనసులో మాట చెప్పుకుంది. తెలుగు, తమిళ భాషల్లో హీరోయిన్లను
చూసుకున్నట్టు -మలయాళంలో చూసుకోరని కూడా సెగలు రేపే వ్యాఖ్యలు చేసిందట. తెలుగు, తమిళంలో స్థిరపడాలని గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నట్టుంది, పరిశ్రమ మీద ప్రశంసలు కురిపిస్తోంది అన్నూ పోరి.