Others

ఆకాశ మార్గాన 'ధన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెలామణీలో లేకుండా ‘పాతర’లలో మూలుగుతున్న కరెన్సీ కట్టల కోసం- చెలామణీలో వున్న కోట్లాది ఐదొందలు, వెయ్యి రూపాయల నోట్లను ఉన్నపళాన చిత్తు కాయితాలుగా మార్చేయడంతో- పేదా, గొప్పా- అంతా సమానమైపోయారు. బాగుంది గాని నిత్యావసర ప్రపంచంలో అనవసరంగా వున్న పైకం అంతా కొత్త నోట్లలోకి మార్చుకోవాలీ అంటే ముప్పాతిక వంతు పనిచెయ్యని ఎ.టి.ఎమ్‌లు- లక్షా ఇరవై వేల లెక్కల వున్న ఖాళీ పోస్ట్ఫాస్ సేవింగ్స్ బ్యాంకులూ సరిపోతాయా? పైగా గ్రామీణ ప్రాంతాల బ్యాంకులలో అంత పైకం వుండదు.
‘‘ప్రజల్ని ఓదార్చడానికి బ్యాంకులు వారు మొబైల్ సందేశాలు గుప్పించుతున్నారు. ‘మీ డబ్బు మీద హామీ’ అంటున్నారు. ఆ బ్యాంకులలోనే చాలినన్ని కొత్త నోట్లు వున్నాయా? లేవు. జనం ‘గాలి’ భోంచేస్తారనుకున్నదా గవర్నమెంటు?’’ అంటూ జనం వీరంగం వేస్తున్న దశలో ప్రభుత్వం వాయు వైమానిక దళానికి చెందిన హెలికాఫ్టర్లను రంగంలోకి దించింది. కరెన్సీ మూటలతో యివి దేశంలో ఆకాశమార్గాన ‘్ధనయాత్ర’లు మొదలుపెట్టేయి.
జార్ఖండ్‌లోని జూకారో ప్రాంతంలో మొదలుపెట్టి ఎ.టి.ఎమ్‌లలో కొత్త నోట్లు పెట్టుకుందికి ఈ లోహవిహంగాలు ఎడతెరిపి లేకుండా ఎగురుతున్నాయిట. సందేశామృతం గ్రోలి- జనాలు రోడ్లమీద పడటమే తప్ప, ఎ.టి.ఎమ్‌లు, బ్యాంకులలోని బట్వాడా కంతలు ఒత్తిడిని తట్టుకోలేకపోతున్నాయి. చలామణీలో వున్న ధనమంతా నల్లధనం కాదు అన్న అవగాహన ప్రభుత్వానికి వచ్చేసరికే - ‘మింట్’ నుంచి నోట్ల బట్వాడా యిరుకున పడ్డది. ఉన్న పోలీసు బలగమంతా క్యూల అదుపుకే సరిపోతున్నది.
ఆ దశలో మహారాష్టల్రోని అంకోలాలో వున్న ఒక ‘్ధబా’ యజమాని హైరోడ్డుమీద వచ్చిపోయే భారీ వాహనదారులందరికీ తన ‘హోటల్’లో ఉచిత భోజన సదుపాయాలు ఏర్పాటుచేశాడు. వెయ్యి ఐదొందల నోట్లు పట్టుకుని వరుసగా బారులు తీరి చేత్తో ఊపుతూ ఆకలితో అల్లాడుతున్న జనాలు రుూ అన్నదాతకు జేజేలు చెబుతున్నారు. సరుకు వున్నంతవరకూ అందరికీ భోజనం పెడతానంటున్నాడీ మహారాష్ట్ర అన్నదాత.. అన్నదాతా! సుఖీభవ! అంటున్నారు అంతా. ఏది ఏమైతేనేం బ్యాంకులలోకి మూడు లక్షల కోట్ల రూపాయలు తిరిగి వచ్చేశాయ్ అంటుంది ప్రభుత్వం.

-వీరాజీ veeraji.pkm@gmail.com