Others

నాకు నచ్చిన పాట--చల్లని వెనె్నలలో..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అక్కినేని నాగేశ్వరరావు నటించిన సంతానంలోని ‘చల్లని వెనె్నలలో చక్కని కనె్న సమీపంలో..’ అన్న పాట నాకు చాలా ఇష్టం. 1955లో విడుదలై దాదాపు 60 ఏళ్ళయినాగానీ ఈ పాట ఇప్పటికీ వీనుల విందుగా మనస్సుకు ఆనందాన్నిస్తుంది. పియానో వాయిస్తూ పాటలు పాడే సన్నివేశాలు అప్పట్లో చాలా ఉండేవి. హీరోయిన్ అందాలు చిలికిస్తూ నృత్యం చేస్తుంటే వినిపించే గానం మనోహరం. అనిశెట్టి వామపక్ష భావాలు కలిగిన రచయితే అయినా, ఈ మధుర గీతాన్ని అద్భుతంగా రాశారు. కర్నాటక సంగీత సామ్రాట్ సుసర్ల దక్షిణామూర్తి దృశ్యానికి అనుగుణంగా బాణీని తీర్చిదిద్దారు. వెనె్నల, చందమామ, ఆకాశం, నక్షత్రాలు, మలయమారుతం, మల్లెపూల పరిమళం హృద్యంగా ఉండి ప్రేయసి ముఖ మండలంలో తారలు కనిపించడం తెలి మబ్బుల్లో వాటి కౌగిళ్ళల్లో జాబిలి తేలియాడటం, గాలి పెదవులు సోకగానే పువ్వులు నిదురలో నవ్వడం, ఎన్ని మధురోహలు, భావనల రమణీయతను ఈ పాటలో మనోహరంగా వినవచ్చు. ఘంటసాలకు ఇష్టమైన కళ్యాణి రాగంలో ఆలాపన సంక్లిష్టంగా సాగుతుంది. ఇక్కడో విశేషం ఉంది. ఘంటసాల ప్రజ్ఞకు సుసర్ల పరీక్ష పెట్టారా? అనిపిస్తుంది. ఆనాడు సుసర్ల ఒక సంగీత శిఖరం. ఈ పాటను ఈనాటికీ అనేక సినీ సంగీత సభల్లో, పెళ్లి పందిళ్లలో పాడుతూ ఆనందాన్ని పొందుతున్నారు ప్రజలు. అంతకన్నా పాటకు దొరికిన గొప్ప నిధి ఏముంది.

-బి రాజేశ్వరమూర్తి, చిలకలపూడి