Others

నాకు నచ్చిన చిత్రం--విజేత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెగాస్టార్ చిరంజీవి కెరీర్‌కు కొత్త మలుపునిచ్చిన సినిమాల్లో -విజేత ఒకటి. మాస్ చిత్రాల హీరోగా హవా కొనసాగిస్తున్న సమయంలో -ఒక్కసారిగా క్లాస్‌బాట పట్టి ‘విజేత’గా మెప్పించాడు చిరంజీవి. అప్పటికి కోదండరామిరెడ్డి, చిరంజీవి కాంబినేషన్ అంటే పక్కా మాస్ ఎంటర్‌టైనర్‌లే అన్న భావన ఉండేది. ఆ భావనను బ్రేక్ చేస్తూ -సెంటిమెంట్ ప్రధానంగా కుటుంబ కథా ఇతివృత్తంతో చేసిన సినిమా -మెగా ఫ్యాన్స్‌నే కాదు, మహిళలనూ అమితంగా ఆకట్టుకుంది. చిత్రంలో -కుటుంబ పెద్ద సోమయాజులు చివరి కొడుకు చిరంజీవి. ఆనందాల ఇంట హాయిగా కాలం గడిపేస్తుంటాడు. పెద్ద వదన (శారద) చేతుల్లో పెరిగిన పిల్లాడు కనుక ‘చినబాబు’ అంటూ అతన్ని గారాబం చేస్తుంటుంది. ఆనందాల హరివిల్లులా సాగిపోయే ఇంట -అన్నదమ్ముల కీచులాటలు, భార్యల చెప్పుడు మాటలతో స్వార్థపూరిత యోచనల మధ్య కుటుంబంలో చిక్కులు మొదలవుతాయి. చెల్లి పెళ్లి సమయంలోనూ కొడుకులు చేతులెత్తేయడంతో -కూతురి పెళ్లి కోసం కిడ్ని అమ్ముకోడానికి సిద్ధపడతాడు తండ్రి. అది తెలుసుకుని తీవ్రంగా చలించిపోయిన చిన్న కొడుకు చిరంజీవి -తనకు ఇష్టమైన ఫుట్‌బాల్ ఆటను సైతం కాదని చెల్లి పెళ్లి కోసం తన కిడ్నీ అమ్మేస్తాడు. ఎందుకూ పనికిరానివాడంటూ అందరితో చివాట్లు తిన్నవాడే -తన త్యాగంతో అందనంత ఎత్తుకు ఎలా ఎదిగిపోయాడన్నది అసలు కథ. సెకెండాఫ్‌లో వచ్చే కొన్ని సన్నివేశాల్లో చిరు కంటతడి పెట్టించిన సినిమా. చిరంజీవి సరసన భానప్రియ కనిపించి -ఈ చిత్రం నుంచే హిట్ పెయిర్ అనిపించుకుంది. ‘సిక్సోక్లాకు చేతులు కలుపు’, ‘నా మీద నీగాలి...’ లాంటి పాపులర్ స్పీడ్ సాంగ్స్‌తోపాటు ‘ఎంత ఎదిగిపోయావయ్యా/ ఎదను పెంచుకున్నావయ్యా.. స్వార్థమనే చీకటింటిలో/ త్యాగమనే దీపం పెట్టి’ అన్న భావగర్భితమైన గీతం ఈ చిత్రానికి ప్రాణం. సరదాసరదా చమత్కార సంభాషణలతోపాటు, ఎమోషనల్ డైలాగులు ఇప్పుడెక్కడ వినిపించినా -అక్కడే ఆగిపోయేలా అనిపిస్తాయి. జీవితంలో ఎదురయ్యే ఒడుదుడుకులు మనోనిబ్బరంతో ఎదుర్కొన్నవాడే -విజేత అన్న సందేశంతో సాగే ఈ చిత్రం నాకు చాలా చాలా ఇష్టం.

-కాళిదాసు, కావలి