సబ్ ఫీచర్

పీచు పదార్థాలే గుండెకు బలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుండె గుప్పెడే ఉంటుంది. కాని అది చేసే పని అనంతం. దీనిని పదిలంగా ఉంచుకుంటే పదికాలాలపాటు జీవించగలం. గుండె ఆరోగ్యానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలేమిటో ముందుగా తెలుసుకుంటే గుండె జబ్బులు రాకుండా కాపాడుకోవచ్చు. అధిక బరువు గుండె భారాన్ని పెంచి అనారోగ్యానికి గురి చేస్తుంది. బరువు పెరగకుండా జాగ్రత్త పడడానికి తీసుకునే ఆహారంలో అధిక కొవ్వు వుండకుండా జాగ్రత్తపడాలి. శారీరక వ్యాయామం తప్పనిసరి. మీగడ తీసేసిన పెరుగు, కవ్వంతో చిలికిన మజ్జిగను తీసుకోవాలి. ఆహార పదార్ధాల తయారీలో ఆలివ్ ఆయిల్, పొద్దుతిరుగుడు నూనె, వేరుశనగనూనెనువాడడంమంచిది. మోనో శాచురేటెడ్ ఫాట్స్ తీసుకుంటే శరీరంలో కొలెస్టరాల్ శాతం తగ్గుతుంది. ఈ ఫాట్స్ నెత్తురు గడ్డకట్టకుండా ఆపుతాయి. పీచు పదార్ధాలు తీసుకోవడం గుండె ఆరోగ్యానికి మంచిది. గింజ ధాన్యాలు, కారెట్, బీన్స్, సోయా బీన్స్, బీర, చిక్కుడు, బార్లీ, ఆపిల్, జామకాయ, తేగలు వంటివి తీసుకుంటే కొలెస్ట్రాల్ ఏర్పడకుండా జాగ్రత్తపడవచ్చు.
ఆహార పదార్ధాల్లో ఉప్పును పరిమితంగా తక్కువగాను వాడాలి. ఆహారం ద్వారా లభించే శక్తిని శ్రమ చేసేందుకు ఉపయోగించుకోవాలి. శరీరంలో శక్తిని పెంచుతూ శ్రమపడకుండా విశ్రాంతిగా వుండకూడదు. దేహంలో ఆ శక్తి నిలువ వుండి కొవ్వు శాతం పెరిగిపోతుంది. అందువల్ల దేహానికి శ్రమ, వ్యాయామం అవసరం. లేకపోతే గుండె ఆరోగ్యానికి అవరోధం కలుగుతుంది. స్థూలకాయం, అధిక బరువు వల్ల గుండె జబ్బులే కాక మరెన్నో అనారోగ్యాలతో బాధపడాల్సి వస్తుంది.

-కె.నిర్మల