Others

ఈ కొవ్వొత్తి మరెన్నో దీపాలకు వెలుగు...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భవిష్యత్తును గురించి సృజనాత్మకంగా కాంక్షించేదే జీవిత స్వప్నం. ఈ ఆదర్శమే ఆరేళ్ల చిన్నారి భావన లక్ష్మి ఆచరణలో చేసి చూపించింది. అనేక మంది జీవితాలకు వెలుగును ప్రసాదించింది. అమ్మా నాన్నల ఒడిలో ఒదిగిపోయ నూరేళ్ల జీవితాన్ని అనుభవించాల్సిన వయసులో మృత్యుఒడిలో చేరాల్సి వచ్చింది. అయతే ఈ చిన్నారి చేసిన పని మరెందరికో ఆదర్శ ప్రాయమైంది. ఆరిపోయే కొవ్వొత్తి మరెన్నో దీపాలను వెలిగించినట్టుగా తాను అల్ప ఆయుష్కురాలిని అయినప్పటికీ తన అవయవ దానం ద్వారా మరికొంతమందికి పునర్జన్మను ఇచ్చింది ఈ చిన్నారి. కేరళ రాష్ట్రంలో ప్రస్తుతం స్వచ్ఛంద అవయవదానం బాగా జరుగుతున్నది. పలువురు ప్రజలు తమ మరణానంతరం అవయవదానం చేయడానికి స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారు. ఈ కార్యక్రమానికి స్ఫూర్తి ప్రదాత భావన లక్ష్మి. కేరళలో కొచ్చి జిల్లాలో గల సౌత్ చిత్తురుకు చెందిన భావన ఆ ఊరిలోనే వున్న సెయింట్ మేరీస్ పాఠశాలలో రెండో తరగతి చదువుతున్నది. గత సంవత్సరం లక్ష్మి ఆకస్మికంగా అస్వస్థతకు గురైంది. వైద్య పరీక్షలు అనంతరం ఆమె బ్రెయిన్ ట్యూమర్‌తో బాధపడుతున్నట్టు గుర్తించారు. ఆమెకు వెంటనే శస్త్ర చికిత్స చేయాలని వైద్యులు సూచించారు. ఆమె తల్లిదండ్రులకు ఆర్థిక స్థోమత లేక పోవడంతో ఆమెతోటి విద్యార్థులు స్వచ్ఛందంగా విరాళాలు సేకరించారు. ఈ నిధులతో 2014 డిసెంబర్‌లో, గత జూలైలో ఆమెకు శస్త్ర చికిత్సలు చేసారు. ఈ సందర్భంగా అవయవ దానంపై కేరళలో ప్రచారం ప్రారంభం అయింది. భావన లక్ష్మికి జరుగుతున్న శస్త్ర చికిత్సలు విజయవంతం కావాలని కోరుతూ కేరళీయులు తమ ప్రార్ధన మందిరాలలో ప్రత్యేక ప్రార్ధనలు చేసారు. శస్త్ర చికిత్సల తర్వాత కోలుకున్న చిన్నారి భావన అవయవదానం ఆవశ్యకతను ప్రచారం నిర్వహించింది. ఆమె ప్రచారానికి ముచ్చటపడిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సైతం లక్ష్మిని ప్రత్యేకంగా అభినందించారు.
ఇటీవల బ్రెయిన్ డెడ్ అయిన భావనలక్ష్మి అవయవాలను తల్లిదండ్రులు దానం చేసారు. అవయవ దానం గురించి ప్రచారం చేయడమే కాకుండా తన అవయవాలను దానం చేసి పలువురికి పునర్జన్మ ప్రసాదించిన భావనలక్ష్మి ధన్యజీవి అయింది.

-పి.హైమవతి