Others

అనుభవంతో ఆత్మజ్ఞానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రపంచం చాలా విశాలమైనది. అంతులేని కోరికలు, వాటిని సాధించుకోవటానికి చేసే ప్రయత్నాలు జీవన గమనానే్న శాసిస్తుంటాయి. ఎన్నో ప్రలోభాలకు గురిచేస్తుంటాయి. మనిషికి కావలసింది తను ఏదైతే కోరుకున్నాడో అదే. అప్పుడు అతడు తృప్తిపడతాడు. తృప్తి కలగనపుడు ఆశాభంగం చెందుతాడు. అందువలన చాలా విలువైన కాలం గంగపాలౌతుంది. వాస్తవాలను కూడా విడిచిపెడతారు.
జీవితంలో అందరూ నిజమే మాట్లాడాలి. అది కూడా ఉల్లాసవంతంగా మాట్లాడాలి. కానీ మీ మాట ఇతరులకు ఏమాత్రం మంచి చేయనపుడు అది నిజం అయినా చెప్పటంవల్ల లాభంలేదని మనుధర్మశాస్త్రం చెబుతున్నది.
మంచి, చెడు ఎదురుగా ఉంటే చిత్తం చెడువైపే మొగ్గుచూపుతుంది. కానీ మనసు దైవానికి సంబంధించింది. ప్రశాంతత, మంచినడవడిక, ధైర్యం, న్యాయము, ప్రేమ, నెమ్మదితనము, అనురాగం, మంచితనం, కరుణ, శక్తి యివి అన్నీ మనసుకు చెందినవే. వీటిని అన్నింటినీ పొందాలంటే మనసును ముందుగా స్వాధీనపర్చుకోవాలి.ఆలోచనలలో ఎటువంటి అలజడి వుండరాదు. అహంకారము ఉండరాదు. మనసు నిర్మలంగా ఉండాలి. శరీరాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలి. పాపపు భావనలు రాకుండా ప్రయత్నించాలి. మనసు, బుద్ధి, చిత్తం లాంటి అంతఃకరణాలు పరిశుభ్రతగా ఉంచుకోవాలి.
‘‘ఆత్మవత్ సర్వభూతాని.’’ వేదాలు, వేదాంగాలు, ఉపనిషత్తులు, భగవద్గీత ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. మహాపురుషులు, మహర్షులు అన్నిటికీ అతీతమైన ఆధ్యాత్మిక భావనలో వుంటారు. ఆత్మ ఆంతరంగిక మైనది. దీనిని సాక్షాత్కారం చేసికొనటానికి మన శరీరం గానీ, ఇంద్రియాలుగానీ ఎట్టి ప్రతిబంధకాలు కావు.
మనస్సు ఎప్పుడూ ఆత్మకు లోబడి వుంటుంది. ‘‘నిర్విరామంగా ఆలోచనలను అల్లే మనస్సు యొక్క మూలాన్ని అనే్వషించు. ఎగసిపడే భావాలని తిరస్కరించు. మూలభావంపై ధ్యాస నిలుపు. ఆ వౌనంలో విశ్రమించు.’’ అని శ్రీరమణ మహర్షులు సెలవిచ్చారు.
అందువల్ల మనస్సు నింత్రించబడుతుంది. అనుభవంతో ఆత్మసాక్షాత్కరిస్తుంది.
మానవుడు సంతోషంగా జీవించగల్గాలి. హృదయానుభూతులు సంతోషాన్ని కల్గిస్తాయి. బయటి ప్రపంచపు ఆనందాలు కేవలం క్షణికమైనవి. వాటి మీద సంతోషం ఆధారపడదు. దాగుడుమూతల జీవితంలో మారే పరిస్థితులకు, కాలమాన వ్యవహారిక జీవనానికి మనం అలవాటుపడాలి. అప్పుడు ఎట్టి ఆందోళన అయినా మనస్సు అంతరంగాలలో వ్యాకులతను కల్గించకుండా వుండటం వలన మనిషి వివేచనతో జీవిస్తాడు.
ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పొందితే పరమానందం సిద్ధిస్తుంది. దానికి ప్రయత్నం చెయ్యాలి. పూర్వజన్మ సుకృతం కూడా తోడు కావాలి. అప్పుడే ప్రయత్నానికి పూర్తి ఫలితం దక్కుతుంది. ఎవరు పూర్వజన్మలలో పుణ్యం చేశారో వారికి ఈ జన్మలో అన్నీ మంచి ఫలితాలే వస్తాయి.
అంతరంగాన్ని ఆధ్యాత్మిక భావనతో నింపి, పరమేశ్వరార్పణం చేసి, ప్రయత్నంతో జీవితాన్ని కొనసాగిస్తే ఆత్మసాక్షాత్కారం తప్పక సిద్ధిస్తుంది.

- నిమ్మగడ్డ కాశీవిశే్వశ్వరశర్మ