Others

సగం చూసి అభ్యాసం ( డైరెక్టర్స్ చాయిస్..)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

-విఐ ఆనంద్

‘హృదయం ఎక్కడున్నది?’ ‘టైగర్’లాంటి చిత్రాలు తెలుగులోనూ, ‘అప్పుచి గ్రామం’ తమిళంలో రూపొందించి దర్శకుడిగా తనకంటూ ఓ మార్కును ప్రూవ్ చేసుకున్నాడు విఐ ఆనంద్. ప్రస్తుతం ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’ సినిమాతో టాలీవుడ్‌ను ఆకట్టుకుని దర్శకుడిగా దూసుకుపోతున్న ఆనంద్‌తో ఈవారం చిట్‌చాట్..

మీ నేపథ్యం?
పుట్టి పెరిగింది తమిళనాడు ఈరోడ్‌లో. చెన్నయ్‌లో ఆర్కిటెక్ట్ కోర్స్ చేశాను. గోల్డ్ మెడలిస్ట్‌ని.
మరి దర్శకుడిగా?
దీనికో కథ ఉంది. మా నాన్న ఐదు థియేటర్ల యజమానులకు ఫ్రెండ్. ఆయనతోపాటుగా థియేటర్లకు వెళ్తుండేవాడిని. ఆయన వాళ్లతో కబుర్లాడుతుంటే, నేను థియేటర్‌లో సినిమా చూసేవాణ్ణి. అలా సగం సినిమానే చూడాల్సి వచ్చేది. మిగతా ఎలా ఉంటుందో ఊహించుకునేవాడిని. ఇంకోసారి వెళ్లినపుడు మిగతా సగం చూసే చాన్స్ దొరికేది. అలా నన్ను నేను అప్‌డేట్ చేసుకునేవాణ్ణి. క్రమంగా డైరెక్షన్‌పై ఇంట్రెస్ట్ పెరిగింది. రైటర్‌గా అనేక చిత్రాలకు పనిచేశా. పాత ఇంగ్లీష్ చిత్రాల ప్రేరణ నాపై ఉంటుంది.
ఇష్టమైన జోనర్?
సైన్స్ ఫిక్షన్. ఆ జోనర్ అంటే పిచ్చి. రియల్ లైఫ్‌లో సైన్స్ ఎలా ఇష్టపడతామో, దాన్ని ఫాంటసీగా చూపిస్తే ప్రేక్షకులూ అంతే కనెక్టవుతారు. ప్రస్తుతం అల్లు శిరీష్‌తో చేస్తున్న ప్రాజెక్టు అలాంటిదే.
లవ్, హారర్ చిత్రాల హవా?
కొంతకాలంగా ప్రేక్షకులకు ఈ రెండూ ఫేవరేట్ అయినమాట వాస్తవం. ఏ చిన్న డిఫరెన్స్ చూపించగలిగినా, లవ్, హారర్ జోనర్లను ప్రేక్షకులు ఆదరిస్తారు. దర్శకుడు కొంచెం వేరియేషన్ ప్రదర్శిస్తే, సక్సెస్ ఖాయం.
ఇండస్ట్రీ సమస్యలు?
కొత్త వాళ్లతో సినిమాలు చేసేటప్పుడు సమస్యలు తప్పవు. తీసిన సినిమాను థియేటర్‌కు తేవడం కూడా చాలెంజే. కంటెంట్ వర్కవుటైతే ఫరవాలేదు. కానీ థియేటర్ల నాలుగు స్తంభాలాటలో మనవంతు కోసం ఎదురుచూపు చూడాల్సిందే.
తరువాతి ప్రాజెక్ట్?
అల్లు శిరీష్‌తో చేస్తున్న ప్రాజెక్టు ఒక్కటే ఉంది. ఇంకొన్నింటికి గ్రీన్ సిగ్నల్ అందాలి.
దర్శకుడంటే?
క్రియేటర్. కొత్త ప్రపంచాన్ని చూపేవాడు. ఆడియన్స్‌కి తెలియకుండానే తీసుకెళ్లి మరో లోకం చూపించేవాడు.

-శేఖర్