Others

నాకు నచ్చిన చిత్రం-- సత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రామ్‌గోపాల్ వర్మ దర్శకత్వంలో 1997- 98లో వచ్చిన ‘సత్య’ మాఫియా సినిమాలకే ఓ ‘పాఠ్యగ్రంథం’. అంతర్లీనంగా ‘ప్రేమకథ’. ఓపక్క రెండు గ్రూపుల మధ్య ఆధిపత్య పోరు. రాజకీయాలు మరోపక్క. అద్భుతమైన స్క్రీన్ ప్లే.. సన్నివేశాలకు తగిన పాటలు.. అత్యంత సహజమైన నటన.. వాస్తవికతకు దగ్గరగా తీసిన సినిమా ఇది. తెలుగు చిత్ర పరిశ్రమలో మాఫియా మూవీలకు వర్మ అథారిటీ అన్న విషయం అందరికీ తెల్సిందే. అది ఈ చిత్రంలో పతాక స్థాయిని చూపించాడు. జెడి చక్రవర్తి, ఊర్మిళ, పరేష్ రావల్ తదితర నటులు ఒక ఎత్తయితే, మనోజ్ బాజ్‌పాయ్ ‘బిక్కూమాత్రే’ పాత్రలో చిత్రాన్ని ఒక రేంజ్‌కు తీసుకెళ్లాడు. తరువాత సత్య ఫేమ్ అనిపించుకున్నాడు. అమాయకపు కుర్రాడు ముంబయి వచ్చి ‘మాఫియాడాన్’గా మారడం వెనుక కారణం అంత బలంగాలేకున్నా, ‘స్నేహం’ వల్ల, ‘క్షణికావేశం’ వల్ల అలా జరిగిపోతుంది అనే ‘మెథడ్ యాక్టింగ్’తో జెడి తన పాత్రలో జీవించేశాడు. గలగలా మాట్లాడుతూ, సందడి చేస్తూ నవ్వుతూ, నవ్విస్తూనే ‘అండర్‌వరల్డ్ లీడర్’గా మనోజ్ బలమైన ముద్ర వేశాడు. అతని మరణమూ ఊహించని విధంగా ఉంటుంది. ఊర్మిళతో ‘సత్య’ ప్రేమలో సత్యమున్నా, చివరాఖరుకు ఫలితం అదేనన్న సత్యం బోధపడేలా సన్నివేశాలను రూపొందించటం మనసును ద్రవింపచేస్తుంది. సత్య మరణం దారుణాతి దారుణంగా, బీభత్సంగా, కరుణ రసపూరితంగా సాగుతుంది. సీట్లలోంచి లేవలేకపోతాం. నీరసం ఆవహిస్తుంది. ఆ ప్రభావం నుండి బయటపడలేకపోతాం. పోలీస్ కమిషనర్‌గా పరేష్ అతికినట్లుంటాడు. అతని హత్యా అనూహ్యంగా జరుగుతుంది. ‘కల్లూమామా’ గుర్తుండిపోతాడు. ‘లాయర్’ కూడా. అలాగే ‘సత్య’కు ‘గది’ చూపించినతను, ‘బిక్కూ’ను చంపినతను అందరూ గుర్తుండిపోతారు. పీహెచ్‌డి చెయ్యడానికి అర్హతగల మాఫియా సినిమా అనుకోవచ్చు. బిఇడి చదివే సమయంలో కళాశాలకు బంకుకొట్టి ఎన్నిసార్లు సినిమా చూశామో లెక్కలేదు. సినిమా జరుగుతుందన్న విషయం బయటవాళ్ళకు తెలీనంత నిశ్శబ్దం. ‘నీతోనే వున్నాను,’ ‘చప్పుడైన చెయ్యలేదే’లాంటి పాటలు సందీప్‌చౌతా సహజంగా చేశాడు. నేపథ్య సంగీతం మూడ్‌ను ఎలివేట్ చేస్తుంది.

-కాళిదాసు, కావలి