Others

వామపక్షాల పయనం ఎటు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మనకు స్వాతంత్య్రం వచ్చిన తరువాత మన దేశాన్ని సుభిక్షంగా, స్వాభిమానంగా తీర్చిదిద్దాలని మనం భావించాం. ఎనె్నన్నో కలలు కన్నాం. కానీ, బాధాకరమైన విషయం ఏమంటే ఆ కలలన్నీ కలలుగానే మిగిలిపోయాయి. అవి నెరవేరలేదు. దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించాలని అనుకున్నాం. అది లేకపోగా అధికారంలోకి వచ్చిన ప్రభుత్వాలలోని కొద్దిమంది స్వార్థపరులైన ప్రజాప్రతినిధులు సమాజ అవసరాల కోసం ఉపయోగపడవలసిన ప్రజాధనాన్ని స్కామ్‌ల రూపంలో మింగేశారు. గతంలో ఎక్కడ ఏ రూపంలో చూసినా కుంభకోణాలే. ఈ వ్యవస్థను నిర్మాణం చేసినది అంతయూ కూడా పరోక్షంగా ప్రజాప్రతినిధులే. రాజకీయ పార్టీలు కూడా నల్లడబ్బు సహాయంతోనే అధికారంలోకి వస్తున్నాయి. ఎన్నికలలో విచ్చలవిడిగా డబ్బును వెదజల్లి అధికారంలోకి రావడం సర్వ సాధారణం అయింది. ఈ రాజకీయ కంపును తయారు చేసినది కాంగ్రెస్ పార్టీనే. ఆ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో దేశం ఎంత నష్టపోయిందో అందరికీ తెలుసు. ప్రభుత్వ విభాగాలలో లంచావతారులను కూడా తయారుచేసింది కాంగ్రెస్ పార్టీనే. ఆర్థిక నేరగాళ్లను, కమీషన్లు పుచ్చుకునేవారిని కూడా తయారుచేసింది కాంగ్రెస్ పార్టీనే. అందుకే ఈ దేశం ఎంతగానో వెనక్కిపోయింది.
దేశం ముందుకు నడవాలి. ప్రగతిపథంలో పయనించాలి. రాజకీయ పార్టీలు దేశాభివృద్ధికి ఆలోచించాలి. కానీ, తమ వ్యక్తిగత, ద్వేషపూరిత విధానాలతో ఆలోచించరాదు. సమాజ హితం దిశగా ఆలోచించాలి. స్వార్థపూరిత రాజకీయ పార్టీలు అధికారంలో ఉన్న కారణంగా దేశం, సమాజం ఎంతో నష్టపోయింది. ఆ నష్టాన్ని ఇకనైనా భర్తీచేయాలి. ప్రపంచంలో భారతదేశ ప్రతిష్ఠ పెరగాలి. సామాన్యులకు అభివృద్ధి ఫలాలు అందకుండా మనం ఎంతో ముందుకు వెళుతున్నామనడం సరికాదు. చేతల ద్వారా నిరూపణ కావాలి.
మన దేశంలో కొన్ని లక్షల కోట్ల రూపాయల నల్లధనం ఉందని అందరికీ తెలుసు. కొంతమంది దాచుకున్న ఆ నల్లడబ్బుని బయటికి తీయాలి. సమాజం కోసం ఆ ధనం ఉపయోగపడాలి. ఇందుకోసం కొన్ని కఠినమైన సంస్కరణలు అవసరం. ఈ ఆర్థిక సంస్కరణలలోని భాగమే 500, 1000 రూపాయల నోట్లను రద్దు చేయడం. దేశమంతా ప్రక్షాళన జరగాలి గనుక దీనికి కొద్ది సమయం పట్టవచ్చు. అంతమాత్రాన ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం చేయవద్దు. ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నంలో కొంతమంది విపక్ష నేతలు ‘నల్లకుబేరుల’కు సహకరిస్తూ ఆర్థిక సంస్కరణలను అడ్డుకుంటున్నారు. వామపక్ష నాయకులతో పాటు పశ్చిమ బెంగాల్ సిఎం మమతా బెనర్జీ, దిల్లీ సిఎం అరవింద్ కేజ్రీవాల్ వంటి వారు అవినీతిపరులను ప్రోత్సహిస్తూ వారికి కొమ్ముకాస్తున్నారు. నోట్లరద్దు తర్వాత సామాన్యులకు కొద్దిపాటి కష్టనష్టాలున్నా, దేశ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని వారు మోదీ నిర్ణయాన్ని సమర్థిస్తున్నారు. తాజా సర్వేలో ఎక్కువమంది ప్రజలు నోట్ల రద్దుకు అంగీకరించారన్న విషయం వెల్లడి అయింది. వామపక్ష నాయకులారా.. ప్రస్తుత పరిస్థితులను గమనిస్తే నల్లధనాన్ని కాపాడటానికి మీరు అంగీకరిస్తున్నారని ప్రత్యక్షంగా అర్థం అవుతోంది. అవినీతిపరులను కాపాడడమే మీ లక్ష్యమా?

-గౌరుగారి గంగాధరరెడ్డి