Others

నాకు నచ్చిన పాట-- ఇది చెరగని ప్రేమకు శ్రీకారం.

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘అంకుశం’ (1989) చిత్రంలోని ఓ అద్భుతమైన పాట ఇది. ‘ఇది చెరగని ప్రేమకు శ్రీకారం/ ఇది మమతల మేడకు ప్రాకారం’ అంటూ సాగే రసరమ్య గీతం. శ్రోతలను సంగీత సాగరంలో ఓలలాడించిన పాట. ‘పండిన కలలకు శ్రీరస్తు/ పసుపు కుంకుమలకు శుభమస్తు/ కనివిని ఎరుగని అనురాగానికి..... కలకాలం వైభోగమస్తు.... కలకాలం వైభోగమస్తు...’ అంటూ వేటూరి సుందరరామ్మూర్తి కలంనుంచి జాలువారిన ప్రతి అక్షరంలోనూ ఒకింత కమ్మదనాన్ని ఆస్వాదించొచ్చు. కళ్యాణ దండాలు కౌగిలికి తెలుసు/ రసమయ బంధాలు రాత్రికి తెలుసు/ పడకింట గుసగుసలు పానుపుకు తెలుసు/ చిగురుటాకులో... చిలిపి మాటలు... పసిడి బుగ్గల పలకరింపులు.... పడుచు జంటకే తెలుసు.. అంటూ సాగే చరణాలు అమలిన శృంగారానికి ప్రతీకగా నిలిచాయి. సత్యం సంగీత సారథ్యంలో ఎస్ జానకి గానం చేసిన ఈ పాట సినీ సంగీత రంగంలో మైలురాయిగా నిలిచింది. జీవిత, రాజశేఖర్‌లపై చిత్రీకరించిన ఈ పాటను ఎప్పటికీ మరువలేం. ఎన్నిసార్లు విన్నా ఇంకా వినాలనిపించే గొప్ప పాట ఇది. సిరిమువ్వల రవళిని తలపించే ఈ పాట నాకే కాదు, ఎవ్వరికైనా చాలా చాలా ఇష్టమైనదే.

-వి కొండలరావు, పొందూరు