సబ్ ఫీచర్

సడలని దీక్షే.. సక్సెస్ మంత్రం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నేటి యువత ఎంత చదివినా, ఎంత ఎదిగినా అంతిమ లక్ష్యం డబ్బు సంపాదన వైపే ఉంటుంది. ఇందులో ఆశ్చర్యపడాల్సిన విషయం ఏమీ లేదు. స్వతంత్రంగా బతకడానికి అవసరమైన డబ్బు సంపాదించడం చేతకాకపోతే ఎంతటి మంచివాడినైనా, మేధావినైనా సమాజం తిరస్కార భావంతో చూస్తుంది. అందుకే మంచి కెరీర్ పట్ల యువత అవగాహన పెంచుకుని, ఆ దిశగా లక్ష్యాన్ని సాధించేందుకు కృషి చేయాల్సిందే. ఏదీ సాధించనపుడు కుటుంబ సభ్యులే కాదు, సమాజం కూడా చులకన భావం చూపుతుంది. నిజానికి సమాజం అంటే మరెక్కడో లేదు. మన చుట్టూ ఉన్నవారు, ప్రముఖులుగా చెలామణి అవుతున్నవారు, వారి మాటలకు తలలూపే వారు సమాజంలోని సభ్యులే. వీరిలో డబ్బున్నవారికే పలుకుబడి, పరపతి ఎక్కువగా వుంటుందన్నది వాస్తవం.
ఎవరైనా సరే యవ్వనంలో ఉన్నపుడే శక్తియుక్తులు, లౌక్యం,బలం, కష్టపడే తత్వం వంటివి దండిగా ఉంటాయి. వీటిని కెరీర్ కోసం, తద్వారా సంపాదన కోసం వాడుకోవచ్చు. ఇందులో ఎలాంటి తప్పులేదు. ఒక ప్రయత్నం పూర్తయిన తర్వాత మంచిచెడులు సమీక్షించాలే కానీ, ఆదినుంచి తప్పు ఒప్పుకుంటూ కూర్చోకూడదు. తెలిసో తెలియకో తప్పు చేస్తే దానికి పరిహారం చెల్లించవచ్చు. గమ్యాన్ని చేరుకునే ప్రస్థానంలో అనుకోకుండా కొన్ని తప్పులు జరిగితే బాధపడనక్కరలేదు. ఇతరులకు అపకారం జరగని తప్పులను గురించి తీవ్రంగా పట్టించుకోనవరం లేదు.
శ్రద్ధగా విని, పరిశోధించి, విశే్లషించుకుని , సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకున్నవారు తమ కాళ్ళమీద తాము నిలబడగలుగుతారు. ‘అతి విశ్వాసం’ అనేది లోపల వున్న అపరాధ భావాన్ని కప్పిపుచ్చుకునే స్వభావం. ఆత్మవిశ్వాసంతో కూడిన స్వయం నిర్ణయం మనిషి నిండుతనాన్ని, కచ్చితత్వాన్ని సూచిస్తుంది.
ఎలాంటి లక్ష్యాన్ని సాధించలేదని కొంతమంది ఇతరులపై చాలా తేలిగ్గా కామెంట్స్ చేస్తుంటారు. కొందరైతే ఏదో ఒక పుకారు పుట్టించి విస్తృతంగా ప్రచారం చేస్తుంటారు. వీరిని మానసిక ఉన్మాదులుగా పరిగణించవచ్చు. శారీరక జబ్బులైతే వెంటనే తెలుసుకోగలం. మానసిక జబ్బుల్ని కనిపెట్టాలంటే కష్టం. చాలా సమయం పడుతుంది. ఎవరికైనా ఏదైనా మనస్ఫూర్తిగా ఇచ్చిన రోజున మనసులో చాలా సంతోషం వేస్తుంది. ఇచ్చుటలో ఉన్న హాయి పుచ్చుకోవడంలో ఉండదని గ్రహించాలి. రేపు చేయవలసిన పనిని ఈరోజే నిర్ణయించుకోండి. అర్థం కాని విషయాలను అలా వదిలేయానుకోవడం వివేకం కాదు.
ఆలస్యమైనప్పటికీ పనిలో క్రమబద్ధమైన ప్రగతి సాధించాలి. తొందరపడి అవకాశాలను చేజార్చుకుని ఓటమిపాలు కావొద్దు. ‘ఇది ఇలాగే జరుగుతుంది..’ అని ముందుగా నిర్ణయించుకోకూడదు. అన్ని రకాలుగా ఆలోచించి పథకాన్ని రచించాలి. జరగకూడనివి జరగవచ్చు. ఊహించని విపరీతాలు అభివృద్ధి నిరోధకంగా అడ్డు తగలవచ్చు. మన ప్రయత్నంలో మంచి ఫలితాలు పొందినప్పటికీ గర్వం, అహం ఉండకూడదు. ప్రతిదానికీ డబ్బు పెట్టుబడికన్నా తెలివి, కృషి అవసరమని గుర్తించాలి. గమ్యం గురించి అవగాహన పెంచుకుని, సంకల్ప బలంతో ముందుకు సాగితే కెరీర్‌లో మంచి ఫలితాలు దక్కించుకోవడం అసాధ్యమేమీ కాదు.

-పి.వి.ఆర్.కుమార్