Others

నాకు నచ్చిన చిత్రం-- శ్రీకృష్ణార్జున యుద్ధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలుగు తెరకు అగ్రనటులైన ఎఎన్‌ఆర్, ఎన్‌టిఆర్‌ల నటనను సమతౌల్యం చేస్తూ ‘గయోపాఖ్యానం’గా చిరవిరచితమైన కథాంశాన్ని ‘శ్రీకృష్ణార్జునయుద్ధం’గా మలచారు నిర్మాత, దర్శకుడు కెవి రెడ్డి. అంతటి ప్రజ్ఞాశాలి సిద్ధం చేసుకున్న కథకు పింగళి మాటలు, పాటలు అందిస్తే.. పెండ్యాల మధురమైన సంగీత బాణీలు అందించి ఆవిష్కరించిన అద్భుతమైన తెలుగు చిత్రం ‘శ్రీకృష్ణార్జున యుద్ధం’. తన పేరు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయేలా బ్రహ్మనుంచి వరం పొందిన గయుడు తిరిగివస్తూ, సూర్య నమస్కారం చేస్తున్న శ్రీకృష్ణుని చేతిలో తెలియకుండానే ఉమ్ముతాడు. ఆగ్రహానికి గురైన కృష్ణుడు గయుని సంహరిస్తానని ప్రతిజ్ఞ చేస్తాడు. గయుడు అర్జునుడి నుంచి అభయం పొందుతాడు. అసలు విషయం తెలిసినా ఆడినమాట తప్పకూడదన్న కృతనిశ్చయంతో తన శ్రేయోభిలాషి, బావతో అర్జునుడు యుద్ధానికి దిగడంతో లోకాలన్నీ అల్లకల్లోలం అవుతాయి. పరమశివుడు ప్రత్యక్షమై వారు నరనారాయణులని తెలియచేసి యుద్ధాన్ని విరమింపచేయడం, రాబోయే యుద్ధంలో అర్జునుడి పరాక్రమం, ఖాండవ దహనంలో అగ్నిదేవుడి ద్వారా అందిన అస్త్రాల పరాక్రమం తెలుపడానికే ఈ యుద్ధనాటకమని శ్రీకృష్ణుడు చెప్పడంతో సినిమా ముగుస్తుంది. యతిగా ద్వారకలో ప్రవేశించి సుభద్రకోసం ప్రేమికుడు పడిన పాట్లు, శరణన్నవాడి రక్షణకు శ్రీకృష్ణునితో యుద్ధానికి దిగిన అర్జునుడి పాత్రలో ఎఎన్‌ఆర్ తిరుగులేని నటన చూపించారు. సత్యభామ అలుకతీర్చే భర్తగా, చెల్లి కోర్కెను తీర్చడానికి అర్జునుడిని యతివేషంలో రప్పించి బలరాముడికి తెలియకుండా పెళ్ళిచేయించి, ప్రతిజ్ఞ నెగ్గించుకోడానికి ప్రియతమ బంధువు అర్జునునిడితో తలపడిన ఘట్టాలలో, చెల్లెలితో రాయబార సన్నివేశాలలోను శ్రీకృష్ణుని పాత్రలో ఎన్‌టిఆర్ చూపిన అభినయం మాటల్లో చెప్పలేం. ఇంకా సినిమాలో బి సరోజాదేవి (సుభద్ర), ధూళిపాళ (గయుడు), కాంతారావు (నారదుడు), మిక్కిలినేని (బలరాముడు), జూ.శ్రీరంజని (రుక్మిణి), ఎస్ వరలక్ష్మి (సత్యభామ), తమతమ పాత్రల్లో ఒదిగిపోయారు. అల్లు, బాలసరస్వతి, చదలవాడ హాస్యం కడుపుబ్బ నవ్విస్తుంది. ఘంటసాల, సుశీల, ఎస్ వరలక్ష్మి పాడిన పాటలు, పద్యాలు నేటికీ ప్రజాదరణ పొందుతూ అలరిస్తున్నాయి. అన్నివర్గాల ప్రేక్షకులను అలరించిన చక్కటి పౌరాణిక చిత్రం.

-ఎస్‌ఎస్‌శాస్ర్తీ, విశాఖపట్నం