Others

గుర్తింపు దక్కింది(డైరెక్టర్స్ చాయిస్..)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

-శివరాజ్ కనుమూరి
‘శివ’ చూశాక -చాలామంది యంగ్‌స్టర్స్ సినిమాను టార్గెట్ చేశారు. దర్శకులైపోయారు. అది వర్మ క్రెడిట్. అలా వర్మ సినిమాలు చూసి.. దర్శకుడైపోయాలని నిర్ణయించేసుకుని.. ఆ మార్గంలోనే ప్రయాణించి.. వర్మకే శిష్యుడైపోయి.. ఇప్పుడు డైరెక్టర్ అవతారం ఎత్తాడు -శివరాజ్ కనుమూరి. ఆయన చేసిన ‘జయమ్ము నిశ్చయమురా’ మంచి టాక్ సొంతం చేసుకుంది. సినిమా అంటే ఓ ఫ్యాషన్.. వర్మను చూశాక అంటున్న శివరాజ్‌తో చిట్‌చాట్..
మీ నేపథ్యం?
తూర్పుగోదావరి జిల్లా మట్టుపర్రు మా ఊరు. కంప్యూటర్స్‌లో ఎమ్మెస్సీ చేసి.. లండన్‌లో నాలుగేళ్లు సాఫ్ట్‌వేర్ రంగంలో పనిచేశా.

మరి మూవీ రూట్‌కు ఎలా?
వర్మ సినిమాలంటే ఆసక్తి. ముఖ్యంగా శివ.. తరువాత సత్య. ఆ రెండూ చాలు.. డైరెక్టర్ అవ్వాలన్న కోరిక బలపడిపోడానికి. అంతే.. ఇండియాకు వచ్చేశా. వర్మ కార్పొరేషన్‌లో అసిస్టెంట్‌గా చేరిపోయా. తర్వాత జెడి చక్రవర్తి దగ్గర అసోసియేట్‌గా పనిచేశా.

డైరెక్షన్ చాన్స్?
మన చుట్టూ జరిగే రియలిస్టిక్ అంశాలతో సినిమా చేయాలని అనుకున్నా. కథ రాసుకున్న తర్వాత కొత్తవాళ్లతో చేయాలనుకున్నా. కానీ తెలిసిన ఫేస్ అయితే మంచిదని శ్రీనివాసరెడ్డితో ప్లాన్ చేశా. నిర్మాతను వెతుక్కునే చాన్స్ తీసుకోకుండా.. నేనే నిర్మాతనయ్యా.

రెస్పాన్స్ ఎలావుంది?
హ్యాపీగా ఉంది. ఊహించిన దానికంటే ఆడియన్స్ ఎక్కువగానే రిసీవ్ చేసుకున్నారు. ముఖ్యంగా నేటివిటీ మధ్య వచ్చే సందర్భాలు ప్రేక్షకుల్ని కడుపుబ్బ నవ్వించాయి. పంచ్‌లు, ప్రాసల పట్టించుకోలేదు.

తరువాతి ప్రాజెక్టులు?
ఈ సినిమాను మెచ్చిన దర్శకుడు సుకుమార్. ఆయన బ్యానర్‌లో నాతో సినిమా చేస్తానని మాటిచ్చాడు. ఇప్పుడు నా దగ్గర మరో రెండు కథలు సిద్ధంగా ఉన్నాయి.

-శ్రీ