Others

ఆ రోల్స్ కావాలట!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఊహలతో గుసగుసలాడి.. కుర్రకారును తనవైపునకు తిప్పుకున్న బబ్లీ గాళ్ రాశిఖన్నా -నాలుగైదు సినిమాల్లో సంపాదించిన అనుభవంతో ఇప్పుడు ప్రయోగాలకు ‘తెర’లేపే ప్రయత్నాల్లో ఉంది. సొట్టబుగ్గల్లో దాచుకున్న సిగ్గుతో ఎంతో బిడియంగా కనిపించే రాశి -ఇండస్ట్రీ అనుభవాలతో చాలా ధైర్యవంతురాలిగా మారిపోయిందట. ‘రిస్క్ చేయడానికి నేను రెడీ’ అంటూ నిర్మాతలకు ఆఫర్లిస్తున్న రాశి -వెరైటీ చాలెంజింగ్ రోల్స్‌కు సై అంటూ సంకేతాలిస్తోందట. ఎంతకాలం ఇలా గ్లామర్ రోల్స్‌కు పరిమితమవుతాం. నేనేంటో నిరూపించుకోవాలంటే -సాహసాలకు సిద్ధంకాక తప్పదుగా అంటోందట రాశి. నిర్మాతలు ముందుకు రావాలేగాని, నెగెటివ్ రోల్స్ చేయడానికైనా సిద్ధమేనని చెబుతోంది. చేతిలో కొత్త ప్రాజెక్టులు కరవైతే -ఏ హీరోయిన్ అయినా ఇలాంటి స్టేట్‌మెంట్లు ఇవ్వడం కామన్ అంటూ కొట్టిపారేస్తున్నారు సినీజనాలు. చూద్దాం.. రాశి ప్లాన్ ఎంతవరకూ వర్కవుట్ అవుతుందో.