Others

మీకోసం.. సినివారం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఫిల్మ్ పొట్టిదే అయినా పెద్ద స్క్రీన్‌మీద చూసుకోవాలనో, చూపించాలనో ఎవరికుండదు? అలాంటి వారికి -కేరాఫ్ బిగ్ స్క్రీన్ ‘రవీంద్రభారతి’ అయ్యింది. ప్రతి ‘సినివారం’ పైసా ఖర్చులేకుండా నవతరం సృజనాత్మకతను ‘తెర’పోసి చూపించేందుకు వేదిక రెడీ అయ్యింది. పొట్టి సినిమాలు, పవర్‌ఫుల్ డాక్యుమెంటరీలను సునాయాసంగా రూపొందిస్తున్న వారి సంఖ్య క్రమంగా నవతరంలో పెరుగుతోంది. నిజానికి ఇప్పుడిదొక ఫ్యాషన్ కూడా. ఇలాంటి వాళ్లంతా -కొత్త కథలు, కనెక్టెడ్ కథనాలను టెక్నిక్, టెక్నాలజీతో రంగరిస్తున్నారు. ‘కంటెంట్’ను కళ్లముందుంచి -‘వీళ్లు చాలా టాలెంటెడ్’ అనిపించుకుంటున్న క్రియేటర్లు ఎక్కువవుతున్నారు. అయితే ఈ -నవతరం ఫిల్మ్ మేకర్స్ సృజనాత్మక కష్టమంతా కేవలం వెబ్‌సైట్లకో, ట్యూబ్ చానెల్స్‌కో పరిమితమైపోతుంది.
బిగ్ స్క్రీన్ మీద చూసుకోవడానికి -ప్రివ్యూ థియేటర్లు అందుబాటులో లేవు. ఒకవేళ ఉన్నవాటిని సంపాదించినా -షార్ట్ఫిల్మ్ బడ్జెట్‌కు పదింతల ఖర్చు భరించక తప్పని పరిస్థితి. దీన్ని అర్థం చేసుకున్న తెలంగాణ భాషా, సాంస్కృతిక శాఖ ‘రవీంద్రభారతి మొదటి అంతస్తు’ను దర్శనీయ వేదిక చేసింది. ప్రతి శనివారం సాయంత్రం 4 నుంచి 9 వరకు ‘సినివారం’ పేరిట సమావేశ మందిరంలో -నవతరం దర్శకులు రూపొందించిన షార్ట్ ఫిల్మ్, డాక్యుమెంటరీ, ఫిల్మ్‌లను స్క్రీనింగ్ చేస్తోంది. అంతేకాదు, ఆ సౌకర్యాన్ని ఉచితంగా అందించి ప్రోత్సహిస్తోంది. సో.. ఇప్పుడు ‘షార్ట్’ డైరెక్టర్లకు ‘బిగ్’ స్క్రీన్ కూడా ఫ్రీగా దొరికేస్తుందన్న మాట. చేయాల్సిందల్లా -షార్ట్ ఫిల్మ్ వివరాలు, సంక్షిప్త కథ, సాంకేతిక నిపుణుల వివరాలతో ‘స్క్రీన్’ కోసం దరఖాస్తు చేసుకోవడమే. డైరెక్టర్, సాంస్కృతిక శాఖకు ఉత్తరం రాయడమో, cinivaram.rb@gmail.comyకి మెయిల్ ఛేయడమో చేస్తే చాలు. కొత్తతరం సినిమాకి ఆహ్వానం పలికే ‘సినివారం’ను ఎవ్వరైనా ఉపయోగించుకోవచ్చట. ఇంకేంటి.. పదండి ముందుకు ఫిల్మ్ పట్టుకుని.