Others

ఫైటర్ ప్రగ్య!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సన్నజాజి తీగలా.. ఎర్రగులాబీ నవ్వులా.. తళుక్కున మురిపించే మెరుపు వనె్న -ప్రగ్యా జైస్వాల్. అయితే, ఆమెను అక్కడికే పరిమితం చేయొద్దంటున్నాడు కృష్ణవంశీ. ‘నక్షత్రాన్ని’ నేలకుదింపి ఓ రేంజ్‌లో ఉతికారేసే ఫైట్లు చేయిస్తున్నాడట ఆమెతో. ఇండస్ట్రీలో ఇప్పుడిదే హాట్ టాపిక్‌గా మారింది. బక్కపల్చని దేహంతో ప్రగ్య ఫైట్లు చేయడమేంటి? అని అనుకోవద్దని కూడా అంటోందట. ఫిమేల్ ఓరియంటెడ్ పాత్రల కోసం ఎంతోకాలం ఎదురుచూస్తున్న తనకు ‘నక్షత్రం’ పాత్ర అనూహ్యమేనంటోంది. ఈ సినిమాలో సందీప్‌కిషన్‌తో రెంజీనా జంటకడితే.. సాలిడ్ సాయిధరమ్‌తేజ్‌తో ప్రగ్యా కీలక పాత్ర పోషిస్తోంది. సినిమా ప్రచారానికి టెక్నికల్ ట్రిక్స్ ప్లే చేస్తున్న కృష్ణవంశీ -ఇప్పుడు ఫైట్స్ కంపోజింగ్‌పై ఓ వీడియో విడుదల చేశాడు. ఇందులో తెగ ఫైట్లు చేసేస్తున్న ప్రగ్యను చూస్తుంటే -ఈమెలో ఇంతుందా? అని ఆశ్చర్యపోయే పరిస్థితి. ఏకాఎకిన ఇద్దరు ముగ్గురిని పడగొట్టడం, విలన్లను వెంటపడి తరముతున్న ప్రగ్య ‘నక్షత్రాన్ని’ ఏ రేంజ్‌కు తీసుకెళ్తుందోనని చర్చించుకుంటున్నారు. ఆమె కొట్టే ‘దెబ్బ’కు ప్రేక్షకులు ఎలా పడతారో సినిమా విడుదల తరువాత చూడాలి.