Others

నాకు నచ్చిన చిత్రం-- ఘర్షణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దశాబ్దం క్రితం గౌతమ్‌మీనన్ దర్శకత్వంలో వెంకటేష్, అశిన్ హీరో హీరోయిన్లుగా వచ్చిన ‘ఘర్షణ’ సినిమా నాకు చాలా ఇష్టం. ఘర్షణ-2 ప్లాన్ చేస్తున్నట్టు ఆమధ్య పుకార్లు షికార్లు చేసినపుడు -అలాంటి సినిమా మళ్లీ వస్తే ఎంత బావుండు అనిపించింది. సమాజానికి చీడపురుగుల్లాంటి విలన్ల మీద ఆవేశం ఉన్న ఓ పోలీస్ ఆఫీసర్ తీర్చుకునే రివేంజ్ -అసలు స్టోరీ. ఈ చిత్రం చానల్స్‌లో ఎప్పుడొచ్చినా ఇక మార్చే ప్రసక్తే ఉండదు. ‘వెంకీ’ సినీ జీవితంలోనే అత్యంత స్టైలిష్‌గా, హీరోయిజాన్ని బ్యాలెన్స్‌డ్‌గా చూపించిన చిత్రం ఇది అనిపిస్తుంది. పోలీస్ పాత్రకు కావల్సిన ఆకారం, ఆహార్యం నూరుశాతం కుదిరింది. డీసీపీ రామచంద్రగా తన చలనచిత్ర ప్రస్థానంలో మైలురాయిగా నిలిచేలా కథానాయకుని పాత్ర పోషించాడు వెంకటేష్. హెయిర్ స్టైల్, మీసం, బ్రేస్‌లెట్, జీన్స్ డ్రస్ సరిగ్గా అమరాయి. అశిన్ కూడా టీచర్ పాత్రలో ‘మాయ’గా హుందాగా, అందంగా కనిపించింది. ‘విలన్’ అసలు పేరు మర్చిపోయేలా ‘పాండా’గా గుర్తుండిపోయాడు. ‘యంగ్’ విలనిజం సంస్కృతిని తెలుగు సినిమాకు పరిచయం చేసిన ఘనతలో గౌతమ్ మీనన్‌కూ ఈ సినిమాతో చాన్స్ దొరికింది. రౌడీల పేర్లు కూడా వెరైటీగా (గుట్కా పాండు) ఉంటాయి, వెంకటేష్ బృందంలోని వాళ్ళంతా నిజమైన పోలీసులే అన్నట్టు పాత్రధారులను ఎంపిక చేశారు. ఎవరి పేర్లూ తెలీకున్నా, అందరూ అత్యంత సహజంగా నటించేసరికి, ఆ లోటే తెలీలేదు. ఇక పాటల సంగతి సరేసరి. నినే్న నినే్న చూస్తూ, చెలియ చెలియ, అందగాడా, నీ చిలిపి కళ్ళలోన, ఆడతనమా... అన్నీ బావుంటాయి. చెలియ చెలియ, నినే్న నినే్న చూస్తూ పాటలైతే ఎన్నిసార్లు విన్నా బోర్‌కొట్టదు. ‘కాక్కకాక్క’గా తమిళంలో సూర్య, జ్యోతికలతో వచ్చిన ఈ చిత్రం -వాళ్లిద్దరి ‘పెళ్ళి’కి కారణమైంది. ‘హారిస్ జైరాజ్’ బీజీఎమ్ ప్రాణంపోసింది. వెంకటేష్ క్లైమాక్స్‌లో కొంచెం అరుస్తూ చేసిన యాక్షన్ ఓవర్ అన్పించినా, మిగతా మొత్తంలో ఒదిగిపోయాడు. పుష్కరం కావొస్తున్నా సినిమా మళ్లీ చూస్తే ‘ఫ్రెష్’గా ఫీలౌతాం. కెమేరా, లైటింగ్, లొకేషన్స్ గ్రాండ్‌గా, రిచ్‌గా కన్పిస్తాయి. డైరెక్టర్ టేకింగ్ గురించి ఎంత చెప్పినా తక్కువే.

-కాళిదాసు, కావలి