Others

నయనా’నందం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రిష్ ప్రయత్నాలే కనుక ఫలిస్తే -వెంకీతో నయన్ జోడీకట్టినట్టే. హిట్ పెయిర్‌ను మరోసారి స్క్రీన్‌మీదకు తెచ్చేందుకు క్రిష్ ప్లాన్ చేస్తున్నాడన్న టాక్ ఇండస్ట్రీలో బలంగా వినిపిస్తోంది. లక్ష్మీ చిత్రంతో హిట్ పెయిర్‌గా పేరు తెచ్చుకున్న వెంకీ, నయన్.. ఈమధ్యే ‘బాబు బంగారం’తో మరోసారి మురిపించారు. ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ని దిగ్విజయంగా పూర్తి చేసేసిన క్రిష్, తరువాతి ప్రాజెక్టు వెంకీతో చేయబోతున్నాడు. ప్రాజెక్టుకు వెంకీ ఓకే చెప్పడంతో -పెయిర్‌గా నయన్‌ను ఒప్పించే ప్రయత్నాల్లో ఉన్నాడట. తెలుగుకు కాస్త దూరంగావుంటూ తమిళంలో బిజీ అయిన నయన్, అక్కడ సీనియర్లను పక్కనపెట్టి కుర్ర హీరోలతో సినిమాలు చేస్తూ వ్యూహాత్మకంగా ముందుకెళ్తుంది. వైవిధ్యమైన పాత్రలను ఎంపిక చేసుకోవడంపైనా నయన్ ఆచితూచి అడుగులేస్తోంది. సో.. వెంకీ కోసం క్రిష్ సిద్ధం చేస్తున్న కథ, అందులోని పాత్ర.. నయన్‌ను ఎంతమేరకు ఒప్పిస్తాయనేది చూడాలి.