Others

ఆ వెలుగే వేరు.. శరత్కాలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలుగు చలనచిత్ర నిర్మాణ సంస్థల్లో క్రమశిక్షణ కలిగిన సంస్థగా ‘విశ్వశాంతి’కి పేరుంది. సంస్థ అధినేత కృష్ణా జిల్లా నిమ్మకూరుకు చెందిన ఉప్పలపాటి విశే్వశ్వరరావు. నిమ్మకూరు అనగానే ఎన్టీఆర్ గుర్తుకొస్తారు మనకు. ఈయనా -ఎన్టీఆర్‌కు స్వయాన మేనబావమరిది. బిఎస్పీ పట్టా పుచ్చుకున్న తరువాత -ఎన్టీఆర్ సూచనపై దర్శకుడు పి పుల్లయ్య వద్ద దర్శకత్వ శాఖలో సహాయకుడిగా చేరాడు విశే్వశ్వర రావు. వేంకటేశ్వర మహాత్మ్యం, కన్యాశుల్కం, జయభేరి చిత్రాలకు పుల్లయ్య దగ్గరే పనిచేశారు. సినిమా నిర్మాణంపై ఆసక్తి పెంచుకుని -‘విశ్వశాంతి’ను ప్రారంభించారు. ప్రారంభ చిత్రంగా ఎన్టీఆర్‌తోనే ‘కంచుకోట’ నిర్మించారు. ఆ రోజుల్లో విడుదలైన జానపద చిత్రాల్లో అఖండ విజయం సాధించిన చిత్రంగా అగ్రభాగాన నిలిచింది. మళ్ళీ ఎన్టీఆర్‌తోనే పెత్తందార్లు, నిలువుదోపిడి, దేశోద్ధారకులు చిత్రాలు నిర్మించారు. ఈ నాలుగు చిత్రాలు, అవి సాధించిన విజయాలు గమనిస్తే ‘విశ్వశాంతి’ క్రమశిక్షణ కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. ఒకే హీరో, ఒకే రచయిత, ఒకే దర్శకుడు, ఒకే సంగీత దర్శకుడు.. (ఎన్టీఆర్, సియస్ రావు, మహారథి, కెవి మహదేవన్) ఈ నాలుగు చిత్రాలకు పనిచేయటం ఆ రోజుల్లో ఒక రికార్డు. క్లాప్ కొట్టడం, స్విచ్ ఆన్ చేయటం, ప్రారంభోత్సవ హంగామాలు ‘విశ్వశాంతి’లో ఉండనే ఉండవు. ఒక కర్మాగారంలో పనిలాగా టైమ్ ప్రకారం కాలయాపన లేకుండా చకచకా షూటింగ్ కార్యక్రమాలు ముగించుకొని విడుదలకు సిద్ధంకావటం ఆ సంస్థ ప్రత్యేకత.
**
ఇప్పటి చిత్ర నిర్మాణ తీరు చూస్తుంటే ముక్కున వేలేసుకోక తప్పదు. సంగీత, సాహిత్య విలువలు లేని పాటలకు ఆడియో విడుదల కార్యక్రమం పేరిట కోట్ల ఖర్చు. ప్రతి షెడ్యూల్ షూటింగ్ వివరాలను అభిమానులకు అందిస్తూ ఊరించి విడుదల చేయడం మరో తంతు. సినీ వాతావరణం కలుషితమైంది. అందుకే చిత్ర నిర్మాణం నుంచి మాలాంటి వాళ్లం తప్పుకొన్నాం అంటున్నారు విశే్వశ్వరరావులాంటి సీనియర్ నిర్మాతలు.
**
గతంలో సినిమాకు పెట్టే టైటిల్ విషయంలో కూడా ఎన్నో జాగ్రత్తలు తీసుకుని, ఒకటికి రెండుసార్లు ఆలోచించి.. సెంటిమెంట్ పాటిస్తూ నిర్ణయం తీసుకునేవారు. చిత్రం టైటిల్‌లో సంఖ్యా ప్రసక్తి రావలసి వస్తే భయపడేవారు. విక్టోరియా 203 అనే హిందీ చిత్రాన్ని తెలుగులో నిర్మించినా, నెంబరును ప్రక్కనపెట్టి ‘అందరూ దొంగలే’గా నామకరణం చేశారు. చిత్రనామంలో ‘0’ వుండటం ఆనాటివారు అవమానంగా ఫీలయ్యేవారట. అలాగే ఖైదీ నెం 911 చిత్రం తెలుగులో నిర్మించినా, నెంబరు సూచించక ‘ఖైదీకన్నయ్య’ అని టైటిల్ పెట్టుకున్నారు. ఇప్పటి సినిమాల టైటిల్స్ విషయంలో వెర్రిమొర్రి ఆలోచనలు చేస్తూ.. చిత్ర కథతో సంబంధం లేకున్నా పబ్లిసిటీ ప్రామాణికంగా టైటిల్ పెట్టి ‘కబాలి’ చేసేస్తున్నారు. ఇప్పుడున్న పరిస్థితిపై మాట్లాడటం కంటే వౌనం వహించటం ఉత్తమం అంటుంటారు విశే్వశ్వరయ్య లాంటివాళ్లు.

-పర్చా శరత్‌కుమార్ 9849601717