Others

ఇటు నాగయ్య.. అటు న్యాపతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒకరు మహానటులు. ప్రజలచే భక్త రామదాసుగా కీర్తి ప్రతిష్టలు అందుకున్న చిత్తూరు నాగయ్య. రెండోవ్యక్తి ఆంధ్ర బాలనంద సంఘ వ్యవస్థాపకులు, ఆకాశవాణిలో ఆ రోజుల్లో బాలానందం కార్యక్రమ నిర్వాహకులు, రేడియో అన్నయ్యగా కీర్తింపబడిన న్యాయపతి రాఘవరావు. 1970లో మిర్యాలగూడ మెయిన్‌బజార్ శ్రీరామనవమి ఉత్సవాల్లో తీసిన చిత్రమిది. అప్పటి ఉత్సవాల్లో ఈ మహానుభావులు ఇద్దరినీ సన్మానించుకునే భాగ్యం కలిగింది. ఆ రోజుల్లోనే మద్రాసు నుంచి విమానంలో వెంట ఉండి హైదరాబాద్‌కు తీసుకొచ్చి ద్వారకా హోటల్‌లో బస చేయించాము. అక్కడినుంచి కారులో మిర్యాలగూడకు న్యాయపతి రాఘవరావుతో సహా వచ్చి కార్యక్రమం నిర్వహించినాను. కాకతాళీయంగా ఆరోజు నాగయ్యగారి పుట్టినరోజు. శ్రీరామనవమి ఉత్సవ కమిటీల్లో నేను ముఖ్యుడనైనందున నిర్వహణ బాధ్యతలు నిర్వర్తించడం ఇప్పటికీ అదృష్టంగా భావిస్తుంటాను. ఇద్దరు మహానుభావుల ప్రక్కన కూర్చోవడం భావ్యంకాదని, వేదిక కింద కూర్చొని కార్యక్రమం నిర్వహించాం. ఫొటోలో వృత్తంలో ఉన్న వ్యక్తిని నేను. నాగయ్య దివంగతులైన తర్వాత నటులు అల్లు రామలింగయ్య, ప్రభాకర్‌రెడ్డి, ఆనాటి ప్రఖ్యాత నాయకి రాజశ్రీ తదితరుల సహకారంతో 1975లో వారి స్మారక సంచిక వెలువరించాం.

-తెడ్ల ఓంప్రకాశ్, మిర్యాలగూడ