Others

ఇంతకన్నా ముదురు బ్రహ్మచారి లేడు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తనకి 120 సంవత్సరాల వయసున్నదనీ, తనకంటే రుూ ప్రపంచంలో ‘అస్కలిత బ్రహ్మచారి’ మరొకడు లేడనీ- వారణాశికి చెందిన మహా సన్యాసి స్వామి శివానంద సవాలు చేస్తున్నాడు. 2016లో ఆగస్ట్‌లో తన పుట్టిన రోజుకి శిష్యులు, స్నేహితులూ అందించిన పుట్టిన రోజు కానుకని అందుకుంటూ- ‘‘నేను 1896 ఆగస్టు 8న, ఒక కటిక నిరుపేద కుటుంబంలో జన్మించాను, కావాలంటే, నా పాస్‌పోర్ట్ చూసుకోండి’’ అంటూ చూపెట్టాడు. అంటే స్వామిగారి వయసు 120 ఏండ్లన్నమాట. అయితే తాను ఇంతకాలం ‘ఆడ పొందు’ లేకుండా, అస్కలిత బ్రహ్మచారిగా, శాకాహారి, అతి మితాహారిగా బ్రతికాననీ- యోగా, నిరాడంబర జీవనం- తన ఆయుర్దాయ రహస్యాలని అంటున్న శివానంద స్వామి పిడికెడు పప్పు అన్నం- రెండు పచ్చిమిరపకాయలూ మాత్రం తింటాడు. ఖాద్య తైలం, మిఠాయిలు అంటే ఏమిటో రుచి చూడలేదు అని బ్రహ్మచర్యమే తనకి శ్రీరామరక్ష అని అంటున్నాడు.
ఇంతవరకు అత్యంత వయోవృద్ధుడిగా గిన్నిస్ రికార్డులో వున్న జపాన్ తాతగారు జిరోమాన్‌కిమూరా- తన 117వ ఏట, 2013 జూన్‌లోనే మరణించాడు.
తాను యిప్పుడు స్నేహితుల బలవంతాన రికార్డుకి అర్జీ పెట్టుకుంటున్నాను అంటున్న శివానందస్వామి 120వ ఏట కూడా ఒంటరిగా రైలు ప్రయాణాలూ, పర్యటనలూ చేస్తాడు. కలకత్తాలో యిటీవల ఒక యోగా ప్రదర్శన కూడా ఇచ్చాడు. ఆరో ఏటనే అనాథ అయిపోయిన స్వామి, ఒక గురువుగారి శుశ్రూషణ చేస్తూ దేశం, విదేశం కూడా పర్యటించానంటున్నాడు. ఒంటరిగా వుంటూ, ఏ రోగం, రొష్టూ లేకుండా, వండుకు తింటూ ఉత్తేజమయ జీవితాన్ని గడుపుతున్న రుూ తాతగారు- అధునాతన సాంకేతిక సదుపాయాల్ని హర్షించడు. ‘‘కాస్తంతలో హాయిగా బ్రతకటమే’’ ఇండియన్ స్టైల్ అంటాడు. ‘‘అబ్బా! ఏమీ లేకుండా, అంతకాలం బ్రతకాలంటే బోరు కొట్టదూ?’’ అన్నదొక బామ్మగారు. నిజమే. ఎందుకుటా లైఫ్ మరి?