Others

అక్కడ జీతాలు ఇవ్వరు.. జున్ను ఇస్తారు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెలాఖరుకి జీతం రావడం అనేది ఆధునిక సమాజంలో ఉద్యోగం చేసేవాడి ఆశ. జీతంతోపాటు ‘గీతం’ కొడా వుంటే బెటర్ అనుకుంటారు గానీ నెలంతా కష్టపడ్డాక, ఉద్యోగస్తులకి ఒక ఆర్మేనియన్ డయరీ కంపెనీ అంటే పాల ఉత్పత్తుల సంస్థ ‘పైస’లలో జీతం ఇవ్వను పొమ్మంటోంది. జీతం లెక్కలు కట్టి దానికి సరిపడా ‘జున్ను’ పట్టుకుపోండంటూ వాళ్ళ నెత్తిన కొడుతోంది. అప్పుల వాళ్లకీ అంతే- తిన్నంత ‘జున్ను’ వడ్డీ కూడా కలిపి- పైకం మింజుమలే యిస్తోందిట. చచ్చేలాగా జున్ను ముక్కలు ఉత్పత్తి చేసిందీ కంపెనీ. ఫ్రెంచి రాక్‌ఫోర్ట్ పాల ఉత్పత్తుల కంపెనీ రుూ ‘బ్లూ మూడ్’ మార్కు జున్నుని మార్కెట్‌లో పెడితే, ఎవడూ అటు చూడటంలేదు. ఇంచక్కా జున్నుని చాకుతో కోస్తూ వుంటే ఎంత హాయిగా వుంటుంది! మంచి మనసుని మాటతో పొడిచినట్లుంటుంది. ఫోర్క్‌కి గ్రుచ్చి, ఆరగిస్తే బాగుంటుంది కానీ- పప్పూ, అన్నం, కూరా, అన్నం-పులుసూ అన్నం; పెరుగు బువ్వా- అన్నీ జునే్ననంటే? పాలు తెచ్చి యిచ్చే రైతులకి- ‘జున్ను పట్టుకుపోండి’ అంటున్నారు రుూ కంపెనీ వాళ్లు.
ఈ కంపెనీ అరవైవేల కిలోగ్రాముల జున్ను స్టాకుందిట వీళ్లదగ్గర. కిలో ఖరీదు 280 రూపాయలు మాత్రమే. అసలా పాలే నేరుగా త్రాగితే- మోసుకురావడం కూడా తప్పుతుందిగా? గానీ మిగతా వస్తువుల్ని కార్డు గోకి కొనాలా? బ్యాంకుల్లో బ్యాలెన్స్ లేదు అంటున్నారు- సదరు కంపెనీ ఉద్యోగులు.